
అదే సమయంలో టెస్ట్ ఫార్మాట్లో ఇక టీమ్ ఇండియా జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతున్న బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ సైతం ఇక వెన్నునొప్పి గాయం కారణంగా దూరమయ్యాడు. అయితే మొదటి టెస్ట్ మ్యాచ్ లో అతను ఆడలేని పరిస్థితి ఉంది. అయితే ఇక రెండవ టెస్ట్ మ్యాచ్లో అతను అందుబాటులోకి వస్తాడా లేదా అన్నదానిపై కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి అని చెప్పాలి. ఇక రెండవ టెస్టుకు కూడా అయ్యర్ జట్టులోకి రావడం కష్టమే అనే వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. కానీ ఇటీవల అభిమానులందరికీ కూడా బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. అయ్యర్ జట్టులోకి రాబోతున్నాడు అంటూ వెల్లడించింది బీసీసీఐ.
ఢిల్లీ వేదికగా టీమిండియా ఈనెల 17వ తేదీ నుంచి రెండవ టెస్ట్ మ్యాచ్ ఆడబోతుంది అని చెప్పాలి. అయితే ఇక ఈ రెండవ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా బ్యాట్స్మెన్ అందుబాటులో ఉంటాడట. వెన్ను నొప్పితో తొలి టెస్ట్ కు దూరంగా ఉన్న అయ్యర్ నేషనల్ క్రికెట్ అకాడమీలో జరిగిన మెడికల్ టెస్ట్ లో క్వాలిఫై అయినట్లు తెలుస్తుంది. ఇక త్వరలోనే శ్రేయస్సు అయ్యర్ కూడా భారత జట్టులో చేరబోతున్నాడట. సుదీర్ఘమైన టెస్ట్ ఫార్మాట్లో ఎంతో నిలకడగా రానించి శ్రేయస్ అయ్యర్ రాకతో ఇక భారత జట్టు మిడిల్ ఆర్డర్ ఎంతో పటిష్టంగా మారుతుంది అన్నది క్రికెట్ విశ్లేషకుల అంచనా.