టీమిండియాలో విరాట్ కోహ్లీ కీలక ఆటగాడిగా కొనసాగుతూ వున్నాడు అనే విషయం తెలిసిందే. అయితే ఇక మహేందర్ సింగ్ ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత ఇక అప్పుడు టీమ్ ఇండియాకు వైస్ కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లీ చేతికి సారధ్య బాధ్యతలు వచ్చాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే మూడు ఫార్మాట్లకు కూడా ఎన్నో ఏళ్ల పాటు విరామం లేకుండా కెప్టెన్గా వ్యవహరించాడు విరాట్ కోహ్లీ. ఇక అతని సారథ్యంలో అటు టీమిండియా ఎన్నో అద్వితీయమైన విజయాలను కూడా సాధించింది అని చెప్పాలి. కెప్టెన్ అంటే కోహ్లీ లాగే ఉండాలని ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా అభిప్రాయపడ్డారు.


 అయితే కోహ్లీకి ఉన్న ఫిట్నెస్ దృశ్య ఇంకా చాలా ఏళ్లపాటు టీమిండియా కు కెప్టెన్ గా కొనసాగే అవకాశం ఉంది అని అందరూ భావించారు  అయితే ఐసీసీ టోర్నీలో టీమిండియా విఫలం కావడంతో అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించాలంటూ డిమాండ్స్ వచ్చాయి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ.. టి20 వరల్డ్ కప్ జరిగిన వెంటనే టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్న అంటూ అటు విరాట్ కోహ్లీ ప్రకటించేసాడు. ఇక ఆ తర్వాత బీసీసీఐ అతని వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తొలగించింది  ఇక ఇలా విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుంచి తొలగించడం పెద్ద వివాదం గానే మారిపోయింది.


 విరాట్ కోహ్లీ కి ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే కెప్టెన్సీ నుంచి తొలగించామని అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ చెబితే.. నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అంటూ కోహ్లీ చెప్పాడు. ఇది కాస్త సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇటీవల ఇదే విషయంపై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి. టి20 కెప్టెన్సీ వదులుకోవడంపై మరోసారి ఆలోచించుకోవాలని మీటింగ్లో విరాట్ కోహ్లీతో గంగూలీ అన్నాడు అంటూ చేతన్ శర్మ చెప్పుకొచ్చాడు.. అయితే కోహ్లీ అది వినలేదేమో.. మీడియాతో మాత్రం గంగూలి నన్ను కొనసాగమని చెప్పలేదు అని అబద్ధం చెప్పేసాడు. పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పించడంతో అతని ఈగో హర్ట్ అయింది. అందుకు గంగూలినే కారణం అని కోహ్లీ భావించాడు అంటూ చేతన్ శర్మ అప్పుడు జరిగిన అసలు విషయాని చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: