ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మకు మిస్టర్ కూల్ కెప్టెన్ గా కూడా పేరు ఉంది అన్న విషయం తెలిసిందే. అంతకు ముందు ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లీ లాగా ఎప్పుడు మైదానంలో దూకుడుగా కనిపిస్తూ.. ఇక అగ్ర సీవ్ గా ఉండడం రోహిత్ శర్మలు అసలు చూడం అనే చెప్పాలి. ఎప్పుడు కూల్ గా ఉంటూ ఇక ప్రత్యర్థులను దెబ్బ కొట్టే వ్యూహాలను పన్నుతూ మ్యాచ్ పరిస్థితులను మొత్తం తన వైపుకు తిప్పుకుంటూ ఉంటాడు రోహిత్ శర్మ. రోహిత్ శర్మ లో ఉండే ఇలాంటి స్వభావమే అతని కెప్టెన్ గా ఒక మంచి స్థానంలో నిలబెట్టింది.



 అయితే ఇలా ఎంతో కామ్ అండ్ కూల్ గా ఉండే రోహిత్ శర్మ సైతం అప్పుడప్పుడు మ్యాచ్ జరుగుతుండగా ఏదైనా తప్పు జరిగితే ఆగ్రహంతో ఊగిపోవడం లాంటి ఘటనలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇటీవల రెండవ టెస్టులో కూడా ఇలాంటిదే జరిగింది. తొలి ఇన్నింగ్స్ లో తొలి తో బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాను 263 పరుగులకే భారత బౌలర్లు ఆల్ అవుట్ చేసేసారు. షమీ నాలుగు వికెట్లు పడగొడితే అశ్విన్, జడేజా చెరువు మూడు వికెట్లు సాధించారు. అయితే ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రోహిత్ శర్మ మరోసారి తన ప్రశాంతతను కోల్పోయాడు.



 ఫీల్డ్ ఎంపైర్ తీసుకున్న నిర్ణయం పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇక తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు అని చెప్పాలి. ఫీల్డ్ ఎంపైర్ మైకేల్ గోప్ తీసుకున్న నిర్ణయం పై తీవ్రస్థాయిలో స్పందించాడు. తొలి రోజులో ఆట ఆఖరి ఓవర్ లో  లియోన్ వేసిన బౌలింగ్లో రోహిత్ శర్మ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి ప్యాడ్ కు తాకి ఫార్వర్డ్ షార్ట్ లెగ్ ఫీల్డర్ చేతుల్లోకి వెళ్ళింది. దీంతో ఇక ఆస్ట్రేలియా ఫీల్డర్లు అందరూ కూడా గట్టిగా అప్ఫీల్ చేశాడు. అయితే ఫీల్డ్ ఎంపైర్ గా ఉన్న మైకేల్ గోప్ సైతం ఇక దానిని అవుట్ గా ప్రకటించాడు. దీంతో రోహిత్ శర్మ ఔట్ ఇచ్చిన అంపైర్ పై అరుస్తూ ఇక బ్యాట్ ను గట్టిగా బాదుతూ రివ్యూ తీసుకున్నాడు. రివ్యూలో బంతి ప్యాడ్ ను తగిలినట్లుగా తేలడంతో ఫీల్డ్ ఎంపైర్  తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని నాటౌట్ గా ప్రకటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: