అయితే ఇప్పటికే ఇలా వరుస ఓటములతో సతమతమవుతుంది ఆస్ట్రేలియా జట్టు. ఇలాంటి సమయంలో ఇక ఆస్ట్రేలియా జట్టులో ఏం జరుగుతుందో కూడా తెలియక అభిమానులు అందరూ కన్ఫ్యూషన్లో మునిగిపోతున్నారు. ఎందుకంటే జట్టులో కీలక ఆటగాళ్లుగా కొనసాగుతున్నవారు. వరుసగా గాయాల బారిన పడుతూ జట్టు దూరమవుతున్నారు అని చెప్పాలి. ఇప్పటికే కాలి మడమ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో పేసర్ జోస్ హెజిల్ వుడ్ సిరీస్ మొత్తం దూరమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే రెండు టెస్టులకు స్టార్క్, గ్రీన్ దూరమయ్యారు. అదే సమయంలో ఇటీవల కెప్టెన్ ఫ్యాట్ కమిన్స్ సైతం ఇక వ్యక్తిగత కారణాల నేపథ్యంలో స్వదేశానికి పయనం అవుతున్నాడు.
అయితే మూడో టెస్ట్ సమయానికి తొమ్మిది రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ఇక కమిన్స్ మళ్లీ తిరిగి వస్తాడని చెబుతున్నప్పటికీ ఆ విషయంలో కూడా అనుమానం నెలకొంది. అయితే ఇక ఇప్పుడు మరో స్టార్ ప్లేయర్ ఆస్ట్రేలియా జట్టుకు దూరమయ్యాడు. వార్నర్ కు తగిలిన గాయం తీవ్రమైందని ఇక అతని ఎల్బో ఫ్రాక్చర్ అయింది అన్నది తెలుస్తుంది. దీంతో ఇక తదుపరి మ్యాచ్ లకు అందుబాటులో ఉండడం కష్టమే అని చెప్పాలి.. అయితే వార్నర్ స్థానంలో మ్యాక్స్ వెల్ జట్టులోకి తీసుకుంటారు అన్నది తెలుస్తుంది. ఏదేమైనా గత కొన్ని రోజుల నుంచి అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటూ ఉండడంతో అభిమానులు కన్ఫ్యూషన్ లో మునిగిపోయారు.