సౌత్ ఆఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల టి20 వరల్డ్ కప్ లో భాగంగా భారత జట్టు టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన జట్లలో ఒకటిగా కొనసాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే మొదటి మ్యాచ్ నుంచి కూడా మంచి ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంది భారత మహిళల జట్టు. ఇక మొదటి మ్యాచ్ లోనే చిరకాల ప్రత్యర్థి అయిన  పాకిస్తాన్ తో తలబడింది.  ఇక ఈ మ్యాచ్ లో అందరూ ఊహించినట్లుగానే భారత్ విజయం సాధించింది. ఇక ఆ తర్వాత వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లోను ఘనవిజయాన్ని అందుకుంది అని చెప్పాలి.


 అయితే అప్పటికే రెండు విజయాలు సాధించిన జోరులో ఉన్న భారత జట్టు ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్ లో కూడా ఇదే తరహా ఆట తీరును కనబరిచి విజయాన్ని అందుకుంటుందని భావించినప్పటికీ చివరికి ఓటమి చవి చూసింది. దీంతో ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్ లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా ఇక పసికూన జట్టుపై ఘనవిజయాన్ని సాధించిన టీమిండియా జట్టు అటు వరల్డ్ కప్ లో సెమీఫైనల్ లో అడుగు పెట్టింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే సెమీఫైనల్ లో భారత జట్టు ఎవరిని ఎదుర్కోబోతుంది అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.



 అయితే సెమీ ఫైనల్ లో భారత జట్టుకు కఠినమైన సవాల్ ఎదురు కాబోతుంది అన్నది తెలుస్తుంది. ఎందుకంటే పటిష్టమైన ఆస్ట్రేలియా తో సెమీఫైనల్ లో భారత్ మ్యాచ్ ఆడబోతుంది. ఈనెల 23వ తేదీన ఇరుజట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది అనేది తెలుస్తుంది. అయితే గ్రూప్ -ఎ లో నాలుగు మ్యాచ్లు గెలిచిన ఆస్ట్రేలియా ఎనిమిది పాయింట్లతో టాప్ లో నిలిస్తే.. గ్రూప్ బి లో ఆరు పాయింట్లతో సెమీఫైనల్ లో అడుగు పెట్టింది భారత్. అయితే ఐదుసార్లు వరల్డ్ కప్ను ముద్దాడిన ఆస్ట్రేలియా మహిళల జట్టును ఓడించాలంటే మాత్రం భారత్ ఎంతో కష్టపడాల్సిందే. కాగా గ్రూప్ బి లో టాప్ లో ఉన్న ఇంగ్లాండ్ గ్రూప్ ఏ లో రెండో స్థానంలో నిలిచిన టీం తో పోటీ పడబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: