ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు టెస్ట్ సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్ళింది అన్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోననే ఆతిథ్య  న్యూజిలాండ్ జట్టుతో వరుసగా టెస్ట్ మ్యాచ్లు ఆడుతూ బిజీబిజీగా ఉంది ఇంగ్లాండ్ జట్టు. ఈ క్రమంలోనే ఈ టెస్ట్ సిరీస్ ఎన్నో ప్రపంచ రికార్డులకు వేదికగా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఇరు జట్ల ఆటగాళ్లు కూడా అసాధారణమైన ప్రదర్శన చేస్తూ ఇక ఎన్నో రికార్డులను ఖాతాలో వేసుకుంటున్నారు. ముఖ్యంగా ఇంగ్లాండ్ ప్లేయర్ హరి బ్రూక్స్ అయితే తన అద్భుతమైన ప్రదర్శనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు అని చెప్పాలి. అయితే ఇప్పటికే న్యూజిలాండ్ తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో చెలరేగిపోయిన హరి బ్రూక్స్ ఇక ఇప్పుడు రెండో టెస్టులో కూడా సెంచరీ తో కదం తోక్కాడు అని చెప్పాలి.



 సుదీర్ఘమైన ఫార్మాట్లో ఎంతో నెమ్మదిగా ఆచీతూచి ఆడకుండా ఇక ఇంగ్లాండ్ జట్టు అవలంబిస్తున్న బజ్ బాల్ విధానంలోనే దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థి బౌలర్ల పై ఎటాకింగ్ కి దిగాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే 109 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు. అయితే ఇది అతనికి నాలుగో టెస్ట్ సెంచరీ కావడం గమనార్హం. ఈ క్రమంలోనే హరి బ్రూక్స్ ఇక ఎన్నో అర్దైన రికార్డులు సాధించాడు అని చెప్పాలి. ఇప్పుడు వరకు అతను 6 టెస్ట్ మ్యాచ్లు మాత్రమే ఆడి 100.8  సగటుతో 807 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లలో నాలుగు సెంచరీలు మూడు అర్థ సెంచరీలు ఉన్నాయి అని చెప్పాలి.



 ఇలా గత కొంతకాలం నుంచి కూడా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అసమాన్యమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు హరి బ్రూక్స్. ఇటీవల ఒక అరుదైన ఘనతను తన పేరున లికించుకున్నాడు అని చెప్పాలి. టెస్ట్ ఫార్మాట్లో తొలి 9 ఇన్నింగ్స్ లోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అరుదైన రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు 9 ఇన్నింగ్స్ లలో అతను 87 పరుగులు సాధించాడు. ఇప్పుడు వరకు ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఇక అంతకుముందు భారత మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ చేసిన 798 పరుగులే అత్యధిక పరుగులుగా ఉండేవి. కానీ ఇప్పుడు ఈ రికార్డును బ్రేక్ చేశాడు హరి బ్రూక్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: