ఈ ఏడాదిలోనే భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే గత ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో భాగంగా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియా జట్టు.. సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది అన్న విషయం తెలిసిందే. అప్పుడు వరకు లీగ్ దశ మ్యాచ్ లలో అద్భుతంగా విజయాలు సాధిస్తూ దూసుకు వచ్చిన టీమ్ ఇండియా అటు సెమీఫైనల్ లో మాత్రం ఇంగ్లాండ్కు కనీస పోటీ ఇవ్వలేక పది వికెట్ల తేడాతో ఓటమి చూసింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో వరల్డ్ కప్ గెలుస్తుందని అనుకున్నప్పటికీ అది జరగలేదు.


 అయితే కొన్నాళ్లపాటు ఇక ఇలా ఆస్ట్రేలియాలో ఓడిపోయిన వరల్డ్ కప్ గురించి ఆలోచించి బాధపడిన భారత క్రికెట్ ప్రేక్షకులు గతం గతః అనుకుని ఇక ఇప్పుడు 2023 ఏడాదిలో జరగబోయే వన్డే వరల్డ్ కప్ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. భారత పరిస్థితులను ఉపయోగించుకొని టీమ్ ఇండియా జట్టు టైటిల్ గెలవడం ఖాయమని నమ్మకం పెట్టుకున్నారు. ఇక మరోసారి టీమిండియా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిపోతుంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు టీమిండియాలోని అందరు ఆటగాళ్లు మంచి ఫామ్ లో ఉన్నారు అని చెప్పాలి. దీంతో ఇక వరల్డ్ కప్ కోసం ఆటగాళ్ల ఎంపిక సెలెక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారబోతుంది అని చెప్పాలి.


 ఇదే విషయంపై స్పందిస్తున్న ఎంతో మంది మాజీ ఆటగాళ్లు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో చెప్పేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఇదే విషయంపై దినేష్ కార్తీక్ కూడా స్పందించాడు. గత ఏడాది కాలంలో బౌలింగ్లో అద్భుతంగా రాణిస్తూ జట్టులో కీలక బౌలర్గా మారిపోయిన హైదరాబాద్ ఫేసర్ మహమ్మద్ సిరాజ్ పై ప్రశంసలు కురిపించాడు దినేష్ కార్తీక్.అతను వన్డే ప్రపంచ కప్ లో తప్పకుండా చోటు దక్కించుకుంటాడు అంటూ ధీమా వ్యక్తం చేశాడు. అంతేకాదు ఫిట్నెస్ కాపాడుకుంటే టెస్ట్ ఫార్మాట్లో కూడా భారత జట్టులో కీలక ఫాస్ట్ బౌలర్గా మారతాడని అభిప్రాయపడ్డాడు. అంతేకాకుండా టెస్ట్ ఫార్మట్ లో 300 వికెట్ల మార్క్ ను అందుకో గలడు అంటూ అంచనా వేశాడు దినేష్ కార్తీక్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Dk