సౌత్ ఆఫ్రికా వేదిక జరిగిన మహిళల టి20 వరల్డ్ కప్ లో భాగంగా టీమ్ ఇండియా జట్టు అటు సెమీఫైనల్ లోనే ఓడిపోయి ఇక టోర్నీ నుంచి నిష్క్రమించింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈసారి లీగ్ దశలో మంచి ప్రదర్శన కనబరిచిన  టీమ్ ఇండియా జట్టు తప్పకుండా టైటిల్ గెలుస్తుందని భారత అభిమానులు అందరూ కూడా కొండంత ఆశలుపెట్టుకున్నారు. కానీ అభిమానుల ఆశలు అడియాశలుగానే మిగిలిపోయాయి అని చెప్పాలి. సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ టీమ్ ఇండియా మధ్య నువ్వా నేనా అన్నట్లుగా సాగిన పోరులో చివరికి ఐదు పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోయింది.


 అయితే ఒకానొక సమయంలో టీమిండియా గెలుపు ఖాయం అనుకున్నప్పటికీ ఇక అటు జట్టులో ఉన్న స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్లు అందరూ అవుట్ కావడంతో తక్కువ టార్గెట్ ముందు ఉన్న చేదించలేక పోయింది టీం ఇండియా. ముఖ్యంగా హార్మన్ ప్రీత్ కౌర్ ఔట్ అయినా క్షణం అటు టీమ్ ఇండియా ఓటమి ఖరారు అయిపోయింది అని చెప్పాలి. రన్  చేస్తున్న సమయంలో ఎంతో సింపుల్ గా అవుట్ అయింది హర్మన్ ప్రీత్ కౌర్. అయితే తన బ్యాట్ మట్టిలో ఇరుక్కుపోవడం కారణంగానే ఇలా రన్ అవుట్ కావాల్సి వచ్చింది అంటూ వివరణ కూడా ఇచ్చింది. కానీ రోజురోజుకీ హార్మన్ ప్రీత్ రన్ అవుట్ కాస్త వివాదం గా మారిపోతుంది అని చెప్పాలి.


 ఇప్పటికే టీమ్ ఇండియా మహిళల జట్టు మాజీ కెప్టెన్ స్పందిస్తూ హార్మన్ ప్రీత్ క్రీజులో ఉండడం కీలకమైనప్పుడు అంత మెల్లిగా ఎందుకు పరిగెత్తింది అంటూ విమర్శలు గుప్పించింది.  ఇక ఇప్పుడు ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలీషా హీలి సైతం ఈ రన్ అవుట్ గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది అని చెప్పాలి. సరైన ప్రయత్నం లేకపోవడం కారణంగానే హర్మాన్ ప్రీత్ రన్ అవుట్ అయింది అంటూ అభిప్రాయపడింది ఆసిస్ వికెట్ కీపర్. అదో విచిత్రమైన పరిణామం. దురదృష్టం అంటూ హర్మన్ ప్రీత్ తనకు నచ్చినట్లుగా చెప్పుకోవచ్చు. నిజంగా కృషి చేసి ఉంటే సునాయాసంగా క్రీజు దాటి ఉండొచ్చు. మేం కూడా అలాగే అనుకున్నాం. కానీ దురదృష్టవంతురాలని అని ఆమె జీవితాంతం అనుకున్న తప్పులేదు అంటూ అలీసా హీలి చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: