నేటితరం క్రికెటర్లలో అత్యుత్తమమైన ఫామ్ కనబరిచి అద్భుతమైన రికార్డులు సాధించి ఎవరికి అందనంత దూరంలో ఉన్నాడు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఇక విరాట్ కోహ్లీ లాంటి ఆటగాడు ఎదురుపడితే ఏ బౌలర్ కైనా సరే వెన్నులో వణుకు పుడుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే అతని వికెట్ పడగొట్టాలనే  ఆశ ప్రతి భౌలర్లో ఉన్నప్పటికీ అతనికి బౌలింగ్ చేసేటప్పుడు ముందుగా కోహ్లీ తమ బౌలింగ్లో పరుగులు చేయకుండా ఉండడానికి అని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే తనకు కూడా విరాట్ కోహ్లీ వికెట్ పడగొట్టాలని ఆశ ఉంది అంటూ ఇటీవల పాకిస్తాన్ జట్టులో స్టార్ బౌలర్గా కొనసాగుతున్న హరీష్ రావుఫ్ మనసులో మాట బయటపెట్టాడు అని చెప్పాలి. ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ లీగ్ ఎనిమిదవ ఎడిషన్ లో లాహోర్ కలందర్స్ జట్టు తరఫున ఆడుతున్నారు హరీష్ రావుఫ్. ఈ క్రమంలోనే షఫవర్ జల్మీ, లాహోర్ కలందర్స్ మ్యాచ్ సందర్భంగా షెఫవర్ కెప్టెన్ గా కొనసాగుతున్న బాబర్ అజాం ను హరీష్ రావు కలిశాడు. ఇద్దరి మధ్య ఒక ఆసక్తికర సంభాషణ జరిగింది అని చెప్పాలి.


 ఎవరి వికెట్ తీయడం నీ లక్ష్యం అంటూ హరీష్ రావుఫ్ ను బాబర్ అజాం ప్రశ్నించాడు. అయితే టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్ తీయడమే తన గోల్ అంటూ చెప్పుకొచ్చాడు హరీష్ రావుఫ్. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది. నీతో పాటు విరాట్ కోహ్లీ వికెట్ తీయలేకపోయాను. ఇక ఇప్పుడు మీ ఇద్దరు మాత్రమే మిగిలిపోయారు. ఇక మీ ఇద్దరితో పాటు మరో ముగ్గురు నలుగురు క్రికెటర్లు కూడా నా మైండ్ లో ఉన్నారు. కానీ ముఖ్యంగా మీ ఇద్దరి వికెట్ తీయాలని ఎంతగానో ఆశపడుతున్నాను అంటూ బాబర్ తో చెప్పాడు హరీష్ రావుఫ్.

మరింత సమాచారం తెలుసుకోండి: