
ఐపీఎల్ కోసమే అతను ఫిట్నెస్ కాపాడుకుంటున్నాడు అని కొన్ని విమర్శలు రాగా.. ఇక ఐపిఎల్ సీజన్ మొత్తానికి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో కూడా అతను అందుబాటులో ఉండడు అన్న విషయం ఇటీవల బీసీసీఐ తెలిపింది. దీంతో అభిమానులు అందరూ కూడా షాక్ అయ్యారు. ఇక అతనికి స్పెషల్గా సర్జరీ చేయించేందుకు విదేశాలకు పంపాలని బీసీసీఐ నిర్ణయించింది అన్నది తెలుస్తుంది. అయితే బుమ్రా లాంటి కీలకమైన బౌలర్ లేకుండా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా ఎలా పోరాడుతుందో అని అందరూ ఆందోళనలో మునిగిపోయారు.
ఇక ఇదే విషయంపై ఇటీవలే మాజీ క్రికెటర్ మదన్ లాల్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గాయాలతో గత కొంతకాలంగా జట్టుకు దూరమైన ఫేసర్ జస్ప్రీత్ బుమ్రాను ప్రస్తుతానికి పక్కన పెట్టడం మంచిది అంటూ వ్యాఖ్యానించాడు మదన్ లాల్. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ లో ముగ్గురు ఫేసర్లు ఒక స్పిన్నర్ తో బరిలోకి దిగాల్సి ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక జట్టులోకి ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న ఉమేష్ యాదవ్ ను తీసుకోవాలంటూ సూచించాడు. అయితే బుమ్రా ఏడాదిన్నర తర్వాత జట్టు లోకి వచ్చిన ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. పాత బుమ్రాను చూడాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు.