భారత జట్టులో స్టార్ బౌలర్గా కొనసాగుతున్న బుమ్రా గత కొన్ని నెలల నుంచి గాయం కారణంగా పూర్తిగా క్రికెట్ కు దూరంగానే ఉంటున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇదిగో వస్తాడు అదిగో వస్తాడు అని బుమ్రా గురించి ఎదురు చూడటం తప్ప.. బుమ్రా మాత్రం మళ్లీ పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించి జట్టులోకి వచ్చే పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు. అయితే ఇక ఐపీఎల్లో ఆడటానికి బుమ్రా భారత జట్టులోకి రాకుండా ఫిట్నెస్ కాపాడుకుంటున్నాడు అని మొన్నటికి మొన్న విమర్శలు కూడా వచ్చాయి.


కానీ ఆ తర్వాత బుమ్రా గాయం నుంచి ఇంకా కోలుకోలేదని ఐపిఎల్ తో పాటు వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ కి కూడా పూర్తిగా దూరమవుతాడు అన్న విషయం తెలిసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు అని చెప్పాలి. అయితే ఇప్పటికే గత ఏడాది పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన ముంబై ఇండియన్స్ జట్టు అటు ఈ ఏడాది మాత్రం టైటిల్ కొట్టడమే లక్ష్యంగా బలిలోకి దిగేందుకు సిద్ధమవుతుంది. ఇలాంటి సమయంలో బుమ్రా లాంటి బౌలర్ దూరం కావడం మాత్రం ఆ జట్టుకు కోలుకోలేని ఎదురు దెబ్బ అని చెప్పాలి.


 అయితే బుమ్రా దూరం అవడం ఒక ఎత్తు అయితే ఇక అతని స్థానాన్ని భర్తీ చేయడానికి మరో బౌలర్ ని ఎంపిక చేయడం కూడా ముంబై ఇండియన్స్ కు సవాల్ గానే మారిపోయింది అని చెప్పాలి. ఇకపోతే ఐపీఎల్ మొత్తానికి బుమ్రా  దూరమైన నేపథ్యంలో ఇక సీనియర్ బౌలర్ సందీప్ శర్మను జట్టులోకి తెచ్చుకోవడానికి ముంబై ఇండియన్స్ ప్రయత్నాలు చేస్తుందట. దాదాపు డీల్ పూర్తయినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతుందని తెలుస్తోంది. ఐపీఎల్ పవర్ ప్లే లో అత్యధిక వికెట్లు (53) తీసిన బౌలర్గా సందీప్ శర్మకు పేరుంది. అయితే ఈ సీజన్ కి సంబంధించిన వేలంలో అతని ఏ జట్టు కొనుగోలు చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl