పాకిస్తాన్ సూపర్ లీగ్ లో భాగంగా రోమన్ పావెల్ షిఫావర్ జల్మీకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ లీగ్ లో భాగంగా ఇటీవల ఎక్కువ క్వేట్ట గ్లాడియేటర్స్ తో షిఫావర్ జల్మీ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ లో రోమన్ పావెల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 18 బంతుల్లోనే మూడు ఫ్లోర్లు రెండు సిక్సర్లతో 35 పరుగులు చేసి అజయంగా నిలిచాడు అని చెప్పాలి. ఇక అతని ఇన్నింగ్స్ లో ఒక భారీ సిక్సర్ కూడా ఉండడం గమనార్హం. ఏకంగా 116 మీటర్ల భారీ సిక్సర్ బాధాడు రోవ్ మన్ పావెల్.
షాఫవర్ జల్మీ ఇన్నింగ్స్ సమయంలో 15వ ఓవర్ ను మహమ్మద్ నవాజ్ వేశాడు. ఈ క్రమంలోనే అతను వేసిన తొలి బంతిని రోవ్ మన్ పావెల్ సిక్సర్ గా మలిచాడు. ఇక అతను కొట్టిన బంతి ఏకంగా స్టేడియం బయట వెళ్లి పడింది అని చెప్పాలి. ఇక అతను కొట్టిన భారీ సిక్సర్ తో బౌలర్ నవాజ్ కు మైండ్ బ్లాక్ అయింది అని చెప్పాలి. ఇక రోవ్ మన్ పావెల్ కొట్టిన భారీ సిక్సర్ పాకిస్తాన్ సూపర్ లీగ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ సిక్సర్ గా నిలిచింది అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విటర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. అయితే ఈ మ్యాచ్ లో మాత్రం షిఫావర్ జల్మి జట్టు 8 వికెట్ల తేడాతో పరాజయం పాలు కావడం గమనార్హం.