2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ కోసం అటు అభిమానులు అందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారూ అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే బీసీసీఐ ఐపీఎల్ సీజన్ కు సంబంధించి పూర్తి షెడ్యూల్ ప్రకటించింది. కాగా మార్చి 31వ తేదీ నుంచి కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కాబోతుంది అని చెప్పాలి. ఇక ఈ సీజన్లో కొన్ని జట్లు కొత్త ఆటగాళ్లను కలుపుకొని కొత్తగా ప్రస్తానాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైతే.. మరికొన్ని జట్లు కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి అని చెప్పాలి.


ఈ క్రమంలోనే ఈ ఏడాది ఐపిఎల్ సీజన్లో ఏ జట్టు ప్రస్థానం ఎలా సాగుతుంది అనే విషయంపై అటు విశ్లేషకులు సైతం ఒక అంచనాకు రాలేకపోతున్నారు. ఇక అన్ని జట్లు కూడా తమ ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు పదునైన వ్యూహాలను సిద్ధం చేసుకునే పనిలో బిజీ బిజీగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఇక కోట్లు కుమ్మరించి మరి జట్టును గెలిపిస్తారు అనే నమ్మకంతో కొనుగోలు చేసిన ఆటగాళ్లు గాయాలను బారిన పడుతూ ఉండడం పలు జట్లకు ఊహించని షాకులు ఇస్తున్నాయి అని చెప్పాలి. ఇలా ఇప్పుడు వరకు కొన్ని జట్లకు ఆటగాళ్లు గాయం బారిన పడి ఇక అందుబాటులో లేని పరిస్థితి వచ్చింది.


 ఇక ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ప్లేయర్లందరూ కూడా ఐపీఎల్ లో కనిపించడం కష్టమే అన్న టాక్ వైరల్ గా మారిపోయింది. ఎందుకంటే ఐపీఎల్ మార్చ్ 31 నుంచి ప్రారంభం కానుంది. అయితే సౌత్ ఆఫ్రికా ప్లేయర్లు మార్చి 31 నుంచి ఏప్రిల్ రెండు వరకు నెదర్లాండ్స్ తో.. స్వదేశంలో సౌత్ ఆఫ్రికా తో వన్డే సిరీస్ కూడా ఆడబోతున్నారు. అయితే ఐపీఎల్లో ఆడాల్సిన రబడా, ఎంగిడి, రాసి వాండర్ డస్సేన్, డేవిడ్ మిల్లర్, డికాక్ మార్కరమ్, స్టబ్స్, మార్కో జాన్సన్, క్లాస్ వంటి ప్లేయర్లు దూరమయ్యే ఛాన్స్ ఉంది. ఇలాంటి స్టార్ ప్లేయర్లు దూరం కావడం మాత్రం ఐపీఎల్ లో కొన్ని జట్లకు ఊహించని ఎదురు దెబ్బ అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl