ఫిబ్రవరి 4 నుండి మొదలైన మహిళల ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 1 కు అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ అందుతోంది అని చెప్పాలి. మ్యాచ్ లు జరుగుతున్న మైదానాలకు ప్రజలు హోరున పోటెత్తి వస్తున్నారు. అయిదు టీం లతో మొదటి సీజన్ ను మొదలు పెట్టిన బీసీసీఐ సక్సెస్ అయింది. ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ , గుజరాత్ జాయింట్స్ మరియు యూపీ వారియర్స్ లు ఈ టోర్నీలో టైటిల్ కోసం పోటీ పడుతున్నాయి. ఇప్పటి వరకు 10 మ్యాచ్ లు పూర్తి కాగా ముంబై ఇండియన్స్ ఆడిన నాలుగు మ్యాచ్ లలోనూ గెలిచి పాయింట్ల పట్టికలో మొదటి స్థానాన్ని ఆక్రమించింది.

ఢిల్లీ ఆడిన నాలుగు మ్యాచ్ లలో మూడింట మాత్రమే గెలిచి రెండవ స్థానంలో కొనసాగుతోంది. యూపీ వారియర్స్ రెండు మ్యాచ్ లు గెలిచి మూడవ స్థానంలో ఉంది. ఇక గుజరాత్ జాయింట్స్ 1 గెలవగా, బెంగుళూరు జట్టు మాత్రం నాలుగింట ఓడిపోయి నాక్ అవుట్ స్టేజ్ కు చేరుకుంటుందా అన్న సందేహాన్ని కలిగించింది. బెంగుళూరు టాప్ 3 లో ఉంటేనే టైటిల్ ను గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఇక మిగిలిన నాలుగు మ్యాచ్ లలో విజయం సాధిస్తేనే అది సాధ్యం అవుతుంది. అప్పుడు కూడా ఇతర జట్ల గెలుపు ఓటముల మీద ఆధారపడాల్సి వస్తుంది. ఇక ఎన్నో అంచనాలతో బెంగుళూరు జట్టు యాజమాన్యం మహిళల ఐపీఎల్ ను ఆరంభించింది. పురుషుల లీగ్ లో ఇప్పటి వరకు సాధించని టైటిల్ ను కనీసం మహిళల సారధ్యంలో అయినా చేజిక్కించుకోవాలని ఆశపడింది.

కానీ అనుకున్నది ఒక్కటి అయినది మరొక్కటి లాగా బెంగుళూరు టీం చతికిలపడి ఆడిన నాలుగు మ్యాచ్ లలోనూ ఓడిపోయి యాజమాన్యాన్ని మరియు అభిమానులను నిరాశకు గురిచేసింది. ముఖ్యంగా మహిళల ఇండియన్ టీం స్టార్ బ్యాటర్ స్మృతి మందన్న వరుసగా ఫెయిల్ అవుతుండడమే కారణం అంటూ క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి తర్వాత మ్యాచ్ లలో అయినా స్మృతి పుంజుకుని టీం ను టాప్ 3 లో నిలుపుతుందా చూడాలి. మరికాసేపట్లో ఢిల్లీ తో జరగబోయే మ్యాచ్ బెంగుళూరు కు చావో రేవో మ్యాచ్ అని చెప్పాలి. టీం లో ఉన్న రిచా ఘోష్, పెర్రీ  మరియు డివైన్ లు రాణిస్తే విజయం దక్కినట్లే.
 

మరింత సమాచారం తెలుసుకోండి: