టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ గత ఏడాది డిసెంబర్ 30వ తేదీన రోడ్డు ప్రమాదం బారిన పడ్డాడు అన్న విషయం తెలిసిందే. ఉత్తరాఖండ్లోని రూర్కి సమీపంలో అతని కారు ఏకంగా రోడ్డు పక్కన ఉన్న రీలింగ్ను ఢీ కొట్టింది. ఇక ఈ ప్రమాదంలో రిషిప్ పంత్ కారు అక్కడికక్కడే కాలి బూడిదైంది అని చెప్పాలి. అయితే ప్రమాదం జరగడానికి కొన్ని నిమిషాల ముందు రిషబ్ పంత్ వేగంగా వెళుతున్న కారు నుంచి దూకేయడంతో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి అని చెప్పాలి.


 దీంతో ఇక మోకాలి సర్జరీ కూడా కావడంతో ఇప్పుడిప్పుడే రిషబ్ అంత గాయాలనుంచి కోలుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఇక రిషబ్ పంత్ ఐపీఎల్ సీజన్ కి అందుబాటులో లేకుండా పోయాడు అని చెప్పాలి.  అయితే ఇక రిషబ్ పంచ్ స్థానంలో అనుభవజ్ఞుడైన డేవిడ్ వార్నర్ సారాధ్య బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇకపోతే ఇక రిషబ్ పంత్ అందుబాటులో లేకపోయినప్పటికీ అతన్ని జట్టు చాలా మిస్ అవుతూ ఉండడం గమనార్హం.  జెర్సీని డగ్ అవుట్ లో పెట్టుకుని అటు ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ఆడుతుంది.


 ఇకపోతే ఇటీవలే లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. అయితే మొదటి మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయింది. అయితే లక్నోతో మ్యాచ్ కూ ముందు మాత్రం తమ తుది జట్టును ప్రిడిక్ట్ చేయాలి అంటూ ఢిల్లీ జట్టు యాజమాన్యం రిషబ్ పంతును ట్యాగ్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టింది. ఇక ఈ పోస్ట్ పై స్పందించిన పంత్ ఫన్నీ రిప్లై ఇచ్చాడు. నేను 13వ ఆటగాడిని.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల ఇలా.. లేదంటే 12వ ప్లేయర్ గానే ఉండేవాడిని అంటూ సమాధానం చెప్పాడు. అయితే అతను త్వరగా కోలుకోవాలని అటు అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: