ఇటీవలే ఐపీఎల్లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది అన్న విషయం తెలిసిందే. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై భారీ స్కోర్ చేసింది. అయితే ఆ తర్వాత భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన రాయల్ చాలెంజెస్ బెంగళూరు జట్టు.. ఇక చివరివరకు పోరాడినప్పటికీ విజయం సాధించలేకపోయింది అని చెప్పాలి. ఇలా నువ్వా నేనా అన్నట్లుగా సాగిన పోరులో చెన్నై సూపర్ కింగ్స్ పైచేయి సాధించి విజయాన్ని అందుకుంది అని చెప్పాలి.


 అయితే ఎప్పటిలాగానే మహేంద్రసింగ్ ధోని చివర్లో వచ్చాడు. అయితే అప్పటికే ఇక జట్టులో ఉన్న బ్యాట్స్మెన్లు అందరూ కూడా వీర బాదుడు బాది భారీ స్కోరు చేశాడు. దీంతో ధోనీకి పెద్దగా ఆడే ఛాన్స్ రాలేదు అని చెప్పాలి. కేవలం ఒక బంతిని ఎదుర్కొని సింగిల్ మాత్రమే తీసాడు మహేంద్రసింగ్ ధోని. అయితే ఇలా ఒక్క పరుగు చేయడం కారణంగా ధోని సరికొత్త చరిత్ర సృష్టించలేకపోయాడు అన్నది మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే రెండు పరుగులు చేసి ఉంటే ధోని ఒక అరుదైన రికార్డును సృష్టించేవాడు. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే.. సాధారణంగానే ఆర్సిబి అంటే ధోని ఎప్పుడు రెచ్చిపోతూ ఉంటాడు. ఇక అలాంటి ధోని మరో రెండు పరుగులు చేస్తే ఆర్సిబి పై అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా నిలిచేవాడు.



 ధోని ఇప్పుడు వరకు ఆర్సిబి పై 31 ఇన్నింగ్స్ లో 140 స్ట్రైక్ రేట్ తో 838 పరుగులు చేశాడు. బెంగళూరు జట్టుపై అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ల జాబితాలో ధోని రెండవ స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో డేవిడ్ వార్నర్ 839 పరుగులతో ఉన్నాడు అని చెప్పాలి. అందుకే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో ధోని రెండు పరుగులు చేసి ఉంటే ఇక బెంగళూరు పై అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా అవతరించేవాడు. ఇక ధోని ఇది ఎంతో సులభంగా చేసేస్తాడని అనుకున్నప్పటికీ.. ఆడే అవకాశం లేకపోవడంతో కేవలం సింగిల్ తీసి ఈ రికార్డు కొట్టలేకపోయాడు ధోని.

మరింత సమాచారం తెలుసుకోండి: