ఐపీఎల్-2023 సీజన్‌లో టీమ్స్ మధ్య చాలా రసవత్తర పోరు సాగుతోంది. చివరి బంతి దాకా గెలుపు రెండు జట్ల మధ్య దోబూచులాడుతుండటంతో క్రికెట్ ఫ్యాన్స్ చాలా ఉత్కంఠభరితంగా మ్యాచ్‍లని తిలకిస్తున్నారు.ఇక ఎంఎస్ ధోనీ సారథ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ టీం ఆటగాళ్లు అయితే చాలా ప్రతిభను కనబరుస్తున్నారు. దీంతో ఇప్పటి దాకా ఆ టీం మొత్తం ఆరు మ్యాచ్‌లు ఆడగా.. అందులో ఏకంగా నాలుగు విజయాలు ఉన్నాయి.ఇక పాయింట్ల పట్టికలో సీఎస్ కే టీం మూడో స్థానంలో ఉంది. అయితే, ఆ జట్టును ఆటగాళ్లని మాత్రం గాయాల బెడద ఎంతగానో వేదిస్తోంది. ఇప్పటికే ఆ టీం నుంచి ఐదుగురు కీలక ఆటగాళ్లు గాయం కారణంగా ఫైనల్ జట్టులోకి ఎంపిక కావటం లేదు. తాజాగా ఇంగ్లాండ్ ఆల్‌రౌండ్ క్రికెటర్ అయిన బెన్‌స్టోక్స్ కూడా మరో వారంపాటు టీంకి దూరంగా ఉండనున్నారు. ఇంకా ఈ విషయాన్ని టీం మెయిన్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ చెప్పారు.శుక్రవారం నాడు సన్ రైజర్స్ హైదరాబాద్ టీంతో సీఎస్ కే జట్టు తలపడింది. ఎస్ఆర్‌హెచ్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి కేవలం 134 పరుగులే చేయగా 18.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి సీఎస్‌కే జట్టు విజయం సాధించింది.


ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ ఇంకా ఆల్ రౌండర్ బెన్ స్ట్రోక్స్ ఈ మ్యాచ్ లో ఆడతారని భావించినప్పటికీ చివరి నిమిషంలో గాయం తీవ్రం కావడంతో మరోవారం పాటు విశ్రాంతిని ఇవ్వడం జరిగిందని కోచ్ స్లీఫెన్ ఫ్లెమింగ్ స్పష్టం చేశారు. సీఎస్‌కే టీం బెన్‌స్టోక్స్‌ను గతేడాది జరిగిన మినీవేలంగా ఏకంగా రూ. 16.25 కోట్లకు దక్కించుకుంది.ఇక గాయాల కారణంగా సీఎస్‌కే జట్టు నుంచి ఇప్పటికే దీపక్ చాహర్ మే వరకు మళ్ళీ రెండు వారాలు, జట్టుకు దూరమయ్యారు.ఇంకా వీరితో పాటు సిమ్రంజీత్ సింగ్ గాయం నుండి కోలుకుంటున్నాడు. ముఖేష్ చౌదరి, కైల్ జెమిసన్ ఐపీఎల్ నుంచి తప్పుకోవడం జరిగింది. ఇక మతీషా పతిరణ కొవిడ్ -19 కారణంగా మ్యాచ్ కు దూరమయ్యాడు.అతను కొద్దిరోజులు జట్టుకు అందుబాటులో ఉండడు.అలాగే ఎస్ఎస్ ధోనీ కూడా మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. అయినా కూడా ప్రస్తుతం జట్టుకు సారథ్య బాధ్యతలు వహిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

CSK