ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మాస్ హీరోలుగా కొనసాగుతున్నారు నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి. వీరిద్దరూ బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కొన్నిసార్లు మెగాస్టార్ చిరంజీవి పై చేయి సాధిస్తే ఇంకొన్నిసార్లు బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటేవారు. ఈ ఏడాది సంక్రాంతికి అయితే ఈ ఇద్దరు హీరోలు మరోసారి బాక్సాఫీస్ వద్ద పోటీపడి ఇద్దరు కూడా సూపర్ హిట్ కొట్టారు అన్న విషయం తెలిసిందే. ఇక వీరిద్దరి మధ్య ఎప్పుడు టఫ్ కాంపిటీషన్ ఉంటుంది అని చెప్పాలి.



 అయితే వీరిద్దరి మధ్య ఉండే టఫ్ కాంపిటీషన్ కేవలం సినిమాల వరకే అటు రియల్ లైఫ్ లో మాత్రం వీరిద్దరూ ఎంతో మంచి స్నేహితులుగా మెలుగుతూ ఉంటారు. ఒకరినొకరు పరస్పరం గౌరవించుకుంటూ ఉంటారు అని చెప్పాలి. అయితే బాలయ్య చిరంజీవిల మధ్య ఎంత మంచి స్నేహబంధం ఉంది అనడానికి ఎన్నో ఘటనలు నిదర్శనంగా ఉన్నాయి. ఇందులో ఒక విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకానొక సమయంలో ఏకంగా బాలయ్య సినిమా షూటింగ్ కోసం చిరంజీవి ఏకంగా తన ఇంటిని ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యాడట.



 బాలయ్య హీరోగా నారీ నారీ నడుమ మురారి అనే సినిమా వచ్చింది. ఈ సినిమా ఎంత మంచి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  బాలకృష్ణ కెరియర్ లో 50వ సినిమాకు ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలోనే ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుంది. ఇప్పటికి ఆయన కెరియర్ లో ఎవర్ గ్రీన్ మూవీ గానే ఈ సినిమా కొనసాగుతుంది అని చెప్పాలి. అయితే ఈ సినిమా షూటింగ్ మొత్తం అటు చిరంజీవి ఇంట్లోనే జరిగిందట. మెగాస్టార్కు ఎన్నో హిట్స్ అందించిన కోదండరామిరెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా 90% షూటింగ్ చెన్నైలోనే వెల్లిచ్చేరి ఏరియాలో ఉన్న చిరంజీవి గెస్ట్ హౌస్ లో జరిగిందట. ఇలా బాలయ్య కెరియర్ లో ఈ సినిమా మైలురాయిగా నిలిచిపోవడం ఇక ఈ సినిమా చిరంజీవి ఇంట్లో జరగడం అప్పట్లో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: