భారత క్రికెట్లో అజంక్య రహనే సీనియర్ క్రికెటర్ గా కొనసాగుతున్నాడు. ఒకప్పుడు అతని కెరియర్ ఎంతో సాఫీగా సాగిపోయేది. కానీ మధ్య లో ఫామ్ కోల్పోయాడో లేదో పూర్తిగా జట్టుకు దూరమై పోయాడు అని చెప్పాలి. ఆ తర్వాత యువ ఆటగాళ్ల హవా పెరిగిపోవడంతో ఈ సీనియర్ క్రికెటర్ ని పట్టించుకోవడమే మానేశారు సెలెక్టర్లు. ఒకప్పుడు ఏకంగా కోహ్లీ కెప్టెన్ గా ఉన్నప్పుడు వైస్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన రహానేను కనీసం జట్టులోకి తీసుకోవాలి అనే ఆలోచన చేయడం లేదు సెలెక్టర్లు.



 అయితే అతనిపై టెస్ట్ స్పెషలిస్ట్ ప్లేయర్ గా ముద్ర పడటంతో ఇక పరిమితవర్ల ఫార్మాట్ కి దూరం అయిపోయాడు అని చెప్పాలి. అయితే 2023 ఐపీఎల్ కు సంబంధించి జరిగిన మినీ వేలంలో అన్ని ఫ్రాంచైజీలు అతన్ని పట్టించుకోకపోతే.. అటు చెన్నై మాత్రం బేస్ ప్రైస్ అయిన 50 లక్షలకు అతని జట్టులోకి తీసుకుంది. అయితే ధోని అతని మీద నమ్మకంతో వరుసగా అవకాశాలు ఇవ్వగా.. అతను మెరుపు ఇన్నింగ్స్ లతో అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. మనందరికీ తెలిసిన టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ అజంక్య రహానేనా ఇలా బ్యాటింగ్ చేస్తుంది అని అందరూ ఆశ్చర్యపోతున్నారు అని చెప్పాలి.



 అయితే అతని ఫామ్ చూసిన తర్వాత టీమిండియా సెలెక్టర్లు చేసిన తప్పు తెలుసుకుని వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం అతన్ని జట్టులో ఎంపిక చేశారు. అయితే ఇక డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ కోసం అజింక్య రహనేని జట్టుల్లోకి తీసుకోవడం వెనక భారత మాజీ కెప్టెన్ ధోని పాత్ర ఉన్నట్లు తెలుస్తుంది. భారత జట్టు ఎంపిక ముందు బీసీసీఐ ధోనిని సంప్రదించినట్లు సమాచారం. అయితే రహనే ఫామ్ ఆట తీరు గురించి ధోని ఇక సెలక్టర్లకు వివరించాడట. ఇక ధోని చెప్పడంతో మరో ఆలోచన చేయకుండా రహనేను జట్టులోకి తీసుకున్నారట సెలక్టర్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: