ఐపీఎల్ (IPL) 2023 సీజన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ టీంకి కష్టాలు తప్పట్లేదు. పాపం ఈ టీంకు అస్సలు ఏది కలిసిరావడం లేదు. ఇప్పటి దాకా ఈ సీజన్‌లో మొత్తం ఏడు మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ కేవలం రెండు మ్యాచుల్లోనే విజయం సాధించింది.అందువల్ల పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. అసలే వరుస ఓటములతో సతమతమవుతున్న సన్‌రైజర్స్‌కు ఇప్పుడు మళ్ళీ చాలా గట్టి దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ అయిన వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరం అవ్వడం జరిగింది. ఇక ఈ విషయాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓ ప్రకటనలో తెలియజేసింది. అయితే.. సుందర్ ప్లేస్ లో మాత్రం ఎవరిని తీసుకుంటారు అన్న విషయాన్ని ఇంకా చెప్పలేదు.వాషింగ్టన్ సుందర్ ఈ సీజన్‌లో అంచనాలను అందుకోవడంలో దారుణంగా విఫలం అయ్యాడు. మొత్తం ఏడు మ్యాచ్‌లు ఆడిన సుందర్ తొలి ఆరు మ్యాచుల్లో కనీసం ఒక్క వికెట్ ని కూడా తీయలేకపోవడం అభిమానులకు బాధ కలిగించే విషయం. అయితే ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో మాత్రం అతను చాలా అద్భుతంగా రాణించాడు.


మూడు వికెట్లు తీయడంతో పాటు 24 పరుగులు కూడా చేశాడు. హమ్మయ్య సుందర్ మళ్ళీ ఫామ్‌లోకి వచ్చాడు అని అభిమానులు అనుకునే లోపే అతడు గాయపడ్డాడు. 'ఇక తొడ కండరాల గాయం వల్ల కారణంగా ఈ సీజన్ నుంచి వాషింగ్టన్ సుందర్ తప్పుకోవడం జరిగింది. అతడు మళ్ళీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాము.' అని ఎస్ఆర్‌హెచ్ టీం సోషల్ మీడియా ద్వారా తెలిపింది.కీలక సమయంలో టీంకి దూరం అవుతున్నందుకు నిజంగా చాలా బాధగా ఉందని వాషింగ్టన్ సుందర్ తెలిపాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌కు ఆడటాన్ని చాలా ఎంజాయ్ చేసినట్లు చెప్పాడు. ముఖ్యంగా ఉప్పల్‌లో పెద్ద సంఖ్యలో అభిమానుల మధ్య ఆడడం చాలా ఉత్సాహాన్ని ఇచ్చిందన్నాడు. త్వరలోనే తిరిగి వచ్చి మళ్లీ ఆరెంజ్ ఆర్మీ అభిమానుల సమక్షంలో మ్యాచ్ ఆడతానని వాషింగ్టన్ సుందర్ అన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: