చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో మెరుగైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది . ఛాంపియన్ టీం అనే పేరును నిలబెట్టుకుంటూ వరుసగా విజయాలు సాధిస్తూనే ఉంది అని చెప్పాలి. అయితే ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఇద్దరూ శ్రీలంక ప్లేయర్లు హాట్ టాపిక్ గా మారిపోయారు. వారే తీక్షణ తో పాటు పతిరణ. వీరిద్దరూ దాదాపు చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన అన్ని మ్యాచ్ లలో కూడా తుది జట్టులో చోటు సంపాదించుకున్నారు. కెప్టెన్ ధోని తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాగా రాణిస్తూ ఉన్నారు. కానీ కొన్ని కొన్ని సార్లు ఏకంగా ఎంతో కూల్ గా ఉండే మహేంద్ర సింగ్ ధోనీకి సైతం ఈ ఇద్దరు ప్లేయర్లు కోపం తెప్పిస్తున్నారు అని చెప్పాలి.



 ఈ సీజన్లో ఇప్పటివరకు చెన్నై తరపున ఆడుతున్న శ్రీలంక క్రికెటర్లు తీక్షణ, పతిరణ ఐదేసి వికెట్ల చొప్పున ఖాతాలో వేసుకున్నారు. దీంతో ధోని కూడా వరుసగా చాన్సులు ఇస్తున్నాడు. అయితే ఇటీవల పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్లో కీలక సమయంలో తీక్షణ  చేసిన తప్పు మిస్టర్ కూల్ ధోనీకి సైతం కోపం తెప్పించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ధోని సేన తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే 20 వరల్డ్ లో నాలుగు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. లక్ష్య చేదునకు  దిగిన పంజాబ్ ఆఖరి బంతి వరకు విజయం సాధించింది. అయితే పతీరణ  వేసిన చివరి ఓవర్లో ఆఖరి బంతికి పంజాబ్ బ్యాట్స్మెన్ సికిందర్ రజా 3 పూర్తి చేసి తమ జట్టుకు విజయాన్ని అందించాడు.



 అయితే మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో.. అటు శ్రీలంక బౌలర్ తీక్షణ  చెత్త ఫీల్డింగ్ చేశాడు. దీంతో ధోని కోపంతో ఊగిపోయాడు. ఇన్నింగ్స్ 16 ఓవర్ లో బంతిని ధోని తుషార్ పాండేకు అందించాడు. ఆ సమయంలో క్రీజులో ఉన్న స్టార్ బ్యాట్స్మెన్ లివింగ్ స్టోన్ మొదటి రెండు బంతులు రెండు సిక్సర్లు కొట్టాడు. ఆ తరువాత షార్ట్ పిచ్ బంతిని సందించాడు  బౌలర్ తుషార్. దానిని ఫుల్ షాట్ ఆడబోయిన లివింగ్ స్టోన్  లెక్క తప్పడంతో బంతి బౌండరీ దిశగా వెళ్ళింది. థర్డ్ మ్యాన్ లో ఫీల్డింగ్ చేస్తున్న తీక్షణ  బంతిని తప్పుగా అంచనా వేశాడు.  బంతిని మిస్ చేయడంతో నాలుగు పరుగులు వచ్చాయి. ప్రతి ఒక పరుగు ని కట్టడి చేయడం కీలకమైన సమయంలో ఇలా నాలుగు పరుగులు వదిలేయండంతో ధోని కోపంతో ఊగిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: