ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వరుస సినిమాలతో బిజీబిజీగా గడిపిన అనుష్క.. ఇప్పుడు మాత్రం సినిమా సినిమాకి ఎంతో గ్యాప్ తీసుకుంటుంది. గతంలో నిశ్శబ్దం అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించింది అనుష్క. అయితే ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై అనుష్క నటనకు మంచి మార్కులు పడ్డాయి. కానీ సినిమాకు కమర్షియల్ గా మాత్రం వర్కౌట్ కాలేదు. దీంతో ఆ తర్వాత ఏ సినిమాకి సైన్ చేయలేదు అనుష్క. ఇక ఇప్పుడు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అని సినిమాలో నటిస్తుంది అన్న విషయం తెలిసిందే.



 ఇక ఇటీవల ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ అభిమానులను అలరించింది. ఇక ఈ సినిమా యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతుంది. కాగా ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి స్టాండ్ అఫ్ కమెడియన్ గా నటిస్తూ ఉండగా.. అనుష్క చెఫ్ గా నటిస్తోంది. అయితే ఇక ఈ క్రేజీ కాంబో మూవీపై అటు హైప్ ఒక లెవెల్ లో పెరిగిపోయింది అని చెప్పాలి.  దీనికి తోడు ఇక ఈ సినిమాపై మరింత అంచనాలను పెంచే మరో వార్త సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొడుతుంది. ఏకంగా అనుష్క నటిస్తున్న ఈ సినిమా కోసం కోలీవుడ్ స్టార్ హీరో రంగంలోకి దిగబోతున్నాడట.



 కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గొప్ప నటుడు మాత్రమే కాదు మంచి సింగర్ కూడా అన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో పాటలు పాడి ప్రేక్షకులను అలరించాడు. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం అయితే మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలో ధనుష్ ఒక సాంగ్ పాడబోతున్నాడట. తెలుగులోనే కాదు తమిళ్లో కూడా ధనుష్ పాట పాడబోతున్నాడు అనేది తెలుస్తుంది. అయితే ఈ విషయం తెలిసి నిజంగా ఇది ఊహించని ట్విస్ట్ అని అభిమానులు షాక్ అవుతున్నారు. ధనుష్ పాట పాడుతున్నాడు అంటే ఇక సినిమా సూపర్ హిట్ అయినట్టే అని మరి కొంతమందికి కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: