పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో సూపర్ ఫామ్ లో కనిపిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ప్రతి మ్యాచ్ లో కూడా మంచి ప్రదర్శన చేస్తూ అదరగొడుతున్నాడు. ఇక కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడుతూ జట్టుకు విజయాన్ని అందిస్తున్నాడు. ఎన్నో రోజులుగా భారత జట్టుకు దూరంగా ఉన్న ఈ సీనియర్ క్రికెటర్ ఐపిఎల్ లో రాణించడం ద్వారా భారత సెలక్టర్లు చూపును తన వైపుకు తిప్పుకోవాలని ఆశపడుతున్నాడు. అందుకు అనుగుణంగానే బ్యాటింగ్ ప్రదర్శన చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే శిఖర్ ధావన్ తన బ్యాటింగ్ తో ఎన్నో అరుదైన రికార్డులను కూడా సృష్టిస్తూ ఉండడం గమనార్హం.



 ఇకపోతే ఇటీవలే ఐపీఎల్లో భాగంగా పంజాబ్ కింగ్స్ కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అయితే నువ్వా నేనా అన్నట్లుగా ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ పోరులో మరోసారి చివర్లో రింకు సింగ్ ఫోర్ కొట్టి కోల్కతా నైట్ రైడర్స్ జట్టును గెలిపించాడు అని చెప్పాలి. అయితే ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జట్టు ఓడిపోయినప్పటికీ అటు ఆ జట్టు కెప్టెన్ శిఖర్ ధావన్ మాత్రం అరుదైన రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో 50 హాఫ్ సెంచరీలు కొట్టిన మూడవ బ్యాట్స్మెన్ గా ధావన్ రికార్డు సృష్టించాడు. ఇటీవల కోల్కత్తా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా ఈ ఘనతను అందుకున్నాడు.



 ఈ మ్యాచ్లో 47 బంతులు ఎదుర్కొన్న శిఖర్ ధావన్ 9 ఫోర్లు ఒక సిక్సర్ సహాయంతో 57 పరుగులు చేశాడు. అయితే ఐపీఎల్లో దావన్ ఇప్పటివరకు 50 హాఫ్ సెంచరీలతో పాటు రెండు సెంచరీలు కూడా నమోదు చేశాడు.  అయితే ఇక ఈ ఘనత సాధించిన జాబితాలో అందరికంటే ముందు డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ ఉన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో డేవిడ్ వార్నర్ ఇప్పటివరకు 59 హాఫ్ సెంచరీలు సాధించగా.. విరాట్ కోహ్లీ 50 అర్థ శతకాలు సాధించాడు అని చెప్పాలి. ఇక ఇంకెవరు కూడా ఈ క్రికెటర్లకు చేరువలో  కూడా లేకపోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl