
అయితే సూర్య కుమార్ యాదవ్ ఇప్పుడు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున కూడా మరోసారి అద్భుతమైన ఆట తీరుత చూపిస్తున్నాడు. ఇటీవల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తో జరిగిన మ్యాచ్లో మరోసారి విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడాడు అని చెప్పాలి. ఇకపోతే సూర్యకుమార్ తన ఆటతోనే కాదు తన శరీరం మీద ఉన్న టాటూలతో కూడా అప్పుడప్పుడు వార్తలు నిలుస్తూ ఉంటాడు. అయితే తన బాడీ మీద ఉన్న టాటూల వెనక రహస్యం ఏంటి అన్న విషయాన్ని ఇటీవల సూర్య కుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.
న్యూజిలాండ్ వెళ్లినప్పుడు అమ్మానాన్నల పేర్లు టాటూ వేయించుకోవాలని అనిపించింది. అయితే ఈ విషయంపై ఇక మా పేరెంట్స్ ని అడిగితే వాళ్ళు ఒకే చెప్పారు. దీంతో తొలిసారిగా ముంజేతిపై అమ్మానాన్నల పేర్లను టాటుగా వేయించుకున్నాను. ఇక పెళ్లయిన తర్వాత తన భార్య పేరును టాటూ వేయించుకోవాలని అనిపించింది. ఇక ఆమె పర్మిషన్ తీసుకుని చాతిపై ఆమె పేరు టాటూ వేయించుకున్న. ఇక ఆ తర్వాత క్రమక్రమంగా తనకు ఇష్టమైన డిజైన్స్ అన్ని కూడా శరీరంపై టాటూలు వేయించుకున్న. ఇక ఇప్పుడు శరీరంపై ఎక్కడ ఖాళీ దొరుకుతుందా అని చూస్తున్నాను అంటూ సూర్య కుమార్ యాదవ్ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పి చమత్కరించాడు.