మహేంద్ర సింగ్ ధోని నుంచి మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ అందుకున్నాడు విరాట్ కోహ్లీ. ఇక ఎన్నో ఏళ్ల పాటు భారత జట్టును సారధిగా ముందుకు నడిపించాడు . అయితే ఇక ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవకపోవడంతో కోహ్లీ పై విమర్శలు వచ్చాయి. దీంతో అతను కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దీంతో విరాట్ కోహ్లీ నుంచి రోహిత్ శర్మ మూడు ఫార్మాట్లకు కెప్టెన్సీ చేపట్టాడు. అయితే కోహ్లీ తో పాటే రోహిత్ కూడా సీనియర్. అతను ఎక్కువ కాలం పాటు అన్ని ఫార్మాట్లకు అందుబాటులో ఉండలేడు. దీంతో రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ ఎవరు అనే విషయంపై గత కొంతకాలం నుంచి చర్చ జరుగుతుంది.

 ఒకప్పుడు రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ అంటూ కొంతమంది పేర్లు వినిపించాయి. కానీ గత ఏడాది ఐపిఎల్ లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన హార్దిక్ పాండ్యా.. మొదటి ప్రయత్నంలోనే కప్ గెలిపించడంతో అందరూ దృష్టి అతని వైపు మళ్ళింది. దీంతో రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ కాదు హార్దిక్ పాండ్యానే భారత కెప్టెన్సీకి సరైనవాడు అని అందరూ నమ్మడం మొదలుపెట్టారు. ఇక ఇదే విషయంపై స్పందించిన ఎంతోమంది టీమ్ ఇండియా మాజీ ఆటగాళ్లు హార్దిక్ పాండ్యాకు సారధ్య బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుంది అని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.


 ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై మాట్లాడాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి ఇప్పటికే టీ20 ఫార్మాట్లో భారత స్టాండింగ్ కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యాను.. ఫిట్గా ఉన్నంతకాలం అదే స్థానంలో కొనసాగించాలి అంటూ రవి శాస్త్రి వ్యాఖ్యానించాడు. అయితే భారత సెలక్టర్లు కూడా ఇదే విషయం అనుకుంటున్నారని నేను భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. హార్దిక్ పాండ్యా టాలెంటెడ్ ప్లేయర్.. మిగతా క్రికెటర్లతో పోల్చి చూస్తే అతని ఆలోచనలు ఎంతో భిన్నంగా ఉంటాయి. ఇక ఇప్పుడు గుజరాత్ కెప్టెన్ గా అద్భుతంగా రాణిస్తున్నాడు అంటూ రవి శాస్త్రి వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: