ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు . ఇప్పటివరకు నాలుగు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన టీం గా కొనసాగుతుంది చెన్నై సూపర్ కింగ్స్. మహేంద్రసింగ్ ధోని సారధ్యంలో ప్రతి ఏడాది కూడా మెరుగైన ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటుంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ కి ఇంత క్రేజ్ రావడానికి కారణం ఆ జట్టులో మహేంద్రసింగ్ ధోని ఉండడమే అన్నది అందరికీ తెలిసిన నిజం.ధోనీ లేని చెన్నై సూపర్ కింగ్స్ ను ఊహించుకోవడం కూడా అట అభిమానులకు చాలా కష్టం.



 అయితే మహేంద్రసింగ్ ధోనీకి ఇదే చివరి ఐపిఎల్ అని వార్తలు వస్తున్నాయి. దీంతో  ప్రపంచంలో ఇక అభిమానులందరూ కూడా భారీగా తరలివస్తున్న ఘటనలు కనిపిస్తున్నాయ్. సీఎస్కే మ్యాచ్ ఎక్కడ ఆడినా కూడా స్టేడియం మొత్తం చెన్నై సూపర్ కింగ్స్ కలర్ పసుపు రంగుతో నిండిపోతోంది. అయితే ఇక ఇటీవల కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఇక ప్రస్తుతం పాయింట్లు పట్టికలో రెండవ స్థానంలో కొనసాగుతుంది. చెన్నై సూపర్ కింగ్స్ కోల్కతా చేతిలో    ఓడిపోయింది. అయితే ఒకవేళ చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ చేరాలి అంటే ఏం జరగాలో ఇప్పుడు తెలుసుకుందాం..



 చెన్నై సూపర్ కింగ్స్ మరో రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. అయితే ఇందులో ఒక మ్యాచ్లో గెలిస్తే చాలు ప్లే ఆఫ్ లో చోటు దక్కించుకుంటుంది. చెన్నై సూపర్  కింగ్స్ ఒకవేళ మరో రెండు మ్యాచ్ లు కూడా ఓడిపోతే ఇతర జట్ల ఫలితాలపై ఇక చెన్నై ప్లే ఆఫ్ ఆశలు ఆధారపడి ఉంటాయి. బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు ఒక్క మ్యాచ్ అయిన ఓడిపోవాలి.  ఇక మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ కు అర్హత సాధించడమే కాదు.. టైటిల్ కొట్టాలని అభిమానులు కూడా బలంగా భావిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే  రానున్న రోజుల్లో ధోని ఏం చేస్తాడు అన్నది హాట్ టప్పుడుగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl