
ఎందుకంటే అప్పటి వరకు బ్యాట్స్మెన్లు ఎంతో ఆచితూచి ఆడినవారు.. ఇక డెత్ ఓవర్లలో మాత్రం అంత విద్వాంసాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. చివరికి క్రీజులో ఉన్నది సాదాసీదా బౌలర్లు అయినా సరే సిక్సర్లతో చెలరేగిపోవడానికి బ్యాట్ జులిపిస్తూ ఉంటారు అని చెప్పాలి. దీంతో డెత్ ఓవర్లుగా పిలుచుకునే 19, 20 ఓవర్లలో పరుగులు కట్టడి చేయడం చాలా కష్టం. ఒకవేళ పరుగులు కట్టడి చేయడానికి ప్రయత్నిస్తే రింకు సింగ్ విధ్వంసానికి బలైన యష్ దయాల్ పరిస్థితి అందరికీ ఎదురవుతూ ఉంటుంది. కానీ డెత్ ఓవర్లలో పరుగులు కట్టడం చేసి ఇక ఇటీవల జరిగిన మ్యాచ్లో సూపర్ హీరోగా మారిపోయాడు మోసిన్.
ఇటీవలే ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జాయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో లక్నో విజయానికి మోసిన్ కారణం అని చెప్పాలి. చివరి ఓవర్లో 11 పరుగులు చేస్తే ముంబైని విజయం వరిస్తుంది. అయితే 6 బంతుల్లో 11 పరుగులు అనేది పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఇలాంటి సమయంలో మోసిన్ అద్భుతమైన బౌలింగ్ చేశాడు. ఇక చివరి ఓవర్లో కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి లక్నోకి విజయాన్ని కట్టబెట్టాడు. క్రీజులో మ్యాచ్ విన్నర్లు టీం డేవిడ్, కామరూన్ గ్రీన్ లాంటి ప్లేయర్లు ఉన్నప్పటికీ ఎలాంటి బెదురు లేకుండా మోసిన్ అద్భుతమైన బౌలింగ్ చేశాడు. దీంతో లక్నో విజయానికి అతనే కారణం అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.