2023 ఐపీఎల్ సీజన్ ప్రేక్షకులు ఊహించిన దానికంటే అదిరిపోయే క్రికెట్ మజాకా అందిస్తుంది అన్న విషయం తెలిసిందే. ప్రతి మ్యాచ్ లో కూడా ఊహకందని ఫలితాలు వస్తుండడంతో.. క్రికెట్ ప్రేక్షకులు ఎవరు కూడా ఒక్క మ్యాచ్ మిస్ అవ్వకుండా వీక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే క్రికెట్ ఎంటర్టైర్మెంట్ ని ఎంతగానో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక ఏడాది ఐపీఎల్ సీజన్లో ప్లేయర్లను గాయాల బెడిద కూడా తీవ్రంగా వేధిస్తుంది అని చెప్పాలి  దీంతోఎన్నో జట్లు కీలక ఆటగాళ్ళు గాయం కారణంగా దూరమవడంతో.. ఇక ఎంతగానో ఇబ్బంది పడ్డాయి. వ్యూహాలు మొత్తం తారుమారు కావడంతో ఓటమి చవిచూసే పరిస్థితులను కూడా ఎదుర్కున్నాయి అని చెప్పాలి.



 ఈ క్రమంలోనే కొంతమంది ఆటగాళ్లు గాయం బారిన పడి ఇక ఐపీఎల్ టోర్నీకి మొత్తం దూరమైతే.. మరి కొంతమంది ఆటగాళ్లు మాత్రం గాయం నుంచి కోలుకొని మళ్ళీ ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చి అదరగొడుతున్నారు . ఇక అలాంటి ప్లేయర్లలో లక్నో జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న మోసిన్ ఖాన్ కూడా ఒకడు అని చెప్పాలి. గాయం కారణంగా లక్నో జట్టుకు  అందుబాటులో లేకుండా పోయాడు.

 మోసిన్ ఖాన్ భుజం గాయం కారణంగా ఏడాది పాటు క్రికెట్ కు దూరంగా ఉండగా.. ఇటీవలే ముంబైలో జరిగిన మ్యాచ్లో మాత్రం ఐపిఎల్ లో రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే మొదటి మ్యాచ్ లోనే అద్భుతమైన బౌలింగ్ చేశాడు. ఇటీవల తన గాయం గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.. భుజం దగ్గర రక్తం గడ్డ కట్టడంతో చేతిని కనీసం పైకెత్తలేకపోయాను..ట్రీట్మెంట్ ఒక్క నెల ఆలస్యమైనా చేతిని తీసేయాల్సి వచ్చేదని డాక్టర్లు చెప్పారు.. గాయం వల్ల నేను పడిన బాధ మరొకరికి రావద్దు అంటూ కామెంట్ చేస్తాడు మోసిన్ ఖాన్. కాగా ఈ స్టార్ బౌలర్ రావడంతో అటు లక్నో జట్టు బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl