ఐపీఎల్ లో భాగంగా ప్రస్తుతం లీగ్ మ్యాచ్ లు చివరి దశకు చేరుకున్నాయ్ అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్లే ఆఫ్ లో అడుగు పెట్టబోయే జట్లు ఏవి అన్న విషయంపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ అటు పాయింట్లు పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతూ ప్లే ఆఫ్ లో అడుగుపెట్టిన మొదటి టీం గా రికార్డ్ సృష్టించింది అని చెప్పాలి. ఇక తర్వాత మూడు స్థానాల కోసం జట్ల మధ్య తీవ్రమైన పోటీ జరుగుతుంది. అదే సమయంలో ఇక లీగ్ మ్యాచ్ లు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో.. అటు పోటీ  మరింత రసవత్తరంగా మారిపోయింది అని చెప్పాలి.


 నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న పోరు చివరికి ప్రేక్షకులందరికీ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. ఇకపోతే ఇటీవల పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఇక ప్లే ఆఫ్ లో అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలి అంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయం సాధించింది అని చెప్పాలి. దీంతో రాజస్థాన్ అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగిపోయారు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ప్లేయర్ లివింగ్ స్టోన్ ప్రవర్తన మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా వికెట్ కోల్పోయిన సమయంలో ఎవరైనా సరే నిరాశతో పెవిలియన్ చేరుతూ ఉండడం చూస్తూ ఉంటాం.



 ఇటీవలే పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఇక వికెట్ కోల్పోయిన సమయంలో అటు లివింగ్ స్టోన్ వెక్కిలి నవ్వుతూ అటు పెవిలియన్ వైపు వెళ్ళాడు. ఇక ఇటీవల ఇదే విషయంపై స్పందించిన భారత మాజీ ఆటగాడు యూసుఫ్ పఠాన్  ఆగ్రహం వ్యక్తం చేశాడు అని చెప్పాలి. రాజస్థాన్ తో మ్యాచ్లో షైనీ బౌలింగ్ లో వికెట్ కోల్పోయిన సమయంలో నవ్వుతూ పెవీలియన్  వెళ్లడం పై విమర్శలు చేశాడు. తాను పంజాబ్ జట్టు కోచ్ లేదా కెప్టెన్ లేదంటే మెంటర్ అయి ఉంటే మాత్రం మరోసారి లివింగ్ స్టోన్  ని తుది జట్టులోకి తీసుకోను అంటూ యూసఫ్ పఠాన్ వ్యాఖ్యానించాడు. లివింగ్ స్టోన్ అలా వెక్కిలి నవ్వు ఎందుకు నవ్వాడో తనకైతే అర్థం కాలేదు అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl