ఎన్ని రోజుల నుంచి ప్రేక్షకులు అందరికీ ఎంటర్టైన్మెంట్ పంచుతూ వచ్చిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది అన్న విషయం తెలిసిందే. ఇటీవల లీగ్ మ్యాచ్లు ముగియడంతో ఇక నేటి నుంచి నాకౌట్ మ్యాచ్ లు జరగబోతున్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే నేడు తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ జరగబోతుంది. ఇక ఈ మ్యాచ్ లో భాగంగా పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాలలో నిలిచిన గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది.



 ఇక ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత తొలి ఎలిమినేటర్ మ్యాచ్ ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరగబోతుంది అని చెప్పాలి.  అయితే ఈ ఏడాది ఫైనల్ లో అడుగుపెట్టబోయే రెండు జట్లు ఏవి అనే విషయంపై మాత్రం ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతూ ఉంది అని చెప్పాలి. క్వాలిఫైయర్ వన్ లో ఓడిపోయిన జట్టు క్వాలిఫైయర్ 2 లో ఆడుతుంది. దీంతో ఇలా క్వాలిఫైడ్ వన్ లో  గెలిచి ఫైనల్ అడుగుపెట్టే టీం ఏది ఆ తర్వాత జరగబోయే క్వాలిఫైర్ 2 లో గెలిచే టీమ్ ఏది అనేదానిపై అందరూ చర్చించుకుంటున్నారు.



 అయితే క్వాలిఫైయర్ వన్ లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతూ ఉండగా.. గణాంకాలు మాత్రం ఆసక్తికరంగా మారిపోయాయి. ఇప్పుడు వరకు గుజరాత్ టైటాన్స్ తో జరిగిన ఏ మ్యాచ్ లో కూడా అటు చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించలేదు అని చెప్పాలి. దీంతో ఇక ఇప్పుడు క్వాలిఫైయర్ వన్ మ్యాచ్ లోకి గెలుస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో అటు లక్నోతో జరిగిన మ్యాచ్లో కూడా ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు గెలవలేదు. మరి ఇక ఈ ఏడాది జరగబోయే నాకౌట్ మ్యాచ్లలో చెన్నై, ముంబై జట్టు గెలిచి పాత గణాంకాలను తిరగరాస్తాయా లేదా అన్నది హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl