స్వతంత్ర భారతదేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సుప్రింకోర్టు సోమవారం సంచలన తీర్పు ఇచ్చింది. ఓ కేసులో  ప్రశాంతభూషణ్ కు ఒక్క రూపాయి కేవలం ఒకే ఒక్క రూపాయి జరిమానా విధించింది. ఆ ఒక్క రూపాయి కూడా చెల్లించటానికి ప్రశాంత ఇష్టపడకపోతే  మూడు నెలలు జైలుశిక్ష విధించింది. రూపాయి ఫైన్ చెల్లించటానికి ప్రశాంత్ కు సుప్రింకోర్టు సెప్టెంబర్ 15వ తేదీ వరకు గడువు ఇవ్వటమే ఆశ్చర్యంగా ఉంది. మరి అంత పెద్ద మొత్తంలో ఫైన్ వేస్తే వెంటనే ప్రశాంత్ కట్టలేడని సుప్రింకోర్టు అనుకున్నదో ఏమో. మొత్తానికి సుప్రింకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుపై యావత్ దేశం చర్చ జరుపుతోంది. సుప్రిం ఇచ్చిన తీర్పు విషయంలో జనాలు మాత్రం ప్రశాంత్ కే మద్దతుగా నిలబడటమే విచిత్రంగా ఉంది.
అసలింతకు సుప్రింకోర్టు ప్రశాంత్ కు విధించిన ఫైన్, ఫైన్ చెల్లించలేకపోతే జైలుశిక్ష విధించటం వెనుక పెద్ద కతే ఉంది. అదేమిటంటే సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్టేతో పాటు గతంలో జడ్జీలుగా పని చేసిన కొందరిపై ప్రశాంత్ ట్విట్టర్లో అనుచితమైన వ్యాఖ్యలు చేశాడట. నిజానికి ప్రశాంత్ కూడా పేరున్న లాయరే. ఎన్నో కేసులను తనంతట తానుగా ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలుగా వేసి సుప్రింకోర్టులో వాదించి గెలిచిన ఘటనలు చాలానే ఉన్నాయి.  చాలామంది లాయర్ల లాగ  క్లైంటును బట్టి కాకుండా కేసులోని మెరిట్ ను బట్టి మాత్రమే కేసును టేకప్ చేస్తాడనే పేరు ప్రశాంత్ కు ఉంది. క్లైంట్ తరపున ఒకసారి కోర్టులో వాదిస్తే లక్షల రూపాయల ఫీజులు వసూలు చేసే లాయర్లున్న ఈరోజుల్లో కూడా  మెరిట్ ను మాత్రమే చూసి కేసు టేకప్ చేయటమంటే మామూలు విషయం కాదు. అందుకనే ప్రశాంత్ అంటే యావత్ దేశంలో అంతటి సానుకూల దృక్పదముంది.
ఇక విషయానికి వస్తే బాబ్డే మీద తాను చేసిన కామెంట్ తప్పని తెలియగానే ప్రశాంత్ వెంటనే క్షమాపణ చెప్పుకున్నాడు.  కానీ జడ్జీల మీద చేసిన కామెంట్లను మాత్రం వాపసు తీసుకోవటానికి కానీ క్షమాపణ చెప్పటానికి కానీ ఈ లాయర్ అంగీకరించలేదు. ఎందుకంటే కొందరు జడ్జీల మీద ప్రశాంత్ నేరుగా కామెంట్లేమీ చేయలేదు. గతంలో కొందరు జడ్జీలు మరికొందరు న్యాయమూర్తులపై  చేసిన కామెంట్లనే  ఈ లాయర్ తన ట్విట్టర్లో కేవలం రీ కాల్ చేశాడంతే. దాన్నే సుప్రింకోర్టు సూమోటోగా తీసుకుని ప్రశాంత్ పై కేసు నమోదు చేసింది. తాను చేసినది తప్పయితే గతంలో జడ్జీలు వ్యాఖ్యలు చేసినపుడు వాళ్ళపై ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ చేసిన వాదనకు సుప్రింకోర్టు నుండి సమాధానం రాలేదు. వాళ్ళపై అప్పట్లో చర్యలు తీసుకోలేని సుప్రింకోర్టు అవే వ్యాఖ్యలను తాను గుర్తు చేసింది తప్పెలాగవుతుందంటూ చేసిన వాదనకు కోర్టు సమాధానం చెప్పలేకపోయింది.
ఏదేమైనా తాను తప్పు చేసినట్లు  ప్రశాంత్ తో చెప్పించాలని సుప్రింకోర్టు చేసిన అన్నీ ప్రయత్నాలు విఫలమయ్యాయి. తన ట్వీట్లను వాపసు తీసుకునేది కానీ చేసిన ట్వీట్లపై క్షమాపణ చెప్పటం కానీ జరిగేది కాదంటూ ప్రశాంత్ భీష్మించుకుని కూర్చున్నాడు. దాంతో ఈ లాయర్ వివాదాన్ని ఎలా ముగించాలో అర్ధంకాని సుప్రింకోర్టు చివరకు సోమవారం ఒక్క రూపాయి జరిమాన విధించింది. కోర్టు చెప్పినట్లు ఒక్కరూపాయి జరిమానా విధిస్తానని తర్వాత మీడియాతో మాట్లాడుతూ ప్రశాంత్ చెప్పటం గమనార్హం. అయితే న్యాయ వ్యవస్ధపై తాను కామెంట్ల చేసే విషయంలో వెనక్కు తగ్గేది లేదని మళ్ళీ మరోసారి స్పష్టం చేశాడు. ఏదేమైనా ప్రశాతం-సుప్రింకోర్టు వివాదం మాత్రం దేశంలో సంచలనంగా మారిందనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: