కాలమే అన్నీ గాయాలను మాన్పుతుందని పెద్దలు చెప్పే మాటలు అందరికీ వర్తిస్తాయా అనే డౌటనుమానం పెరిగిపోతోంది. చంద్రబాబునాయుడు మటలను వింటుంటే పెద్దలు చెప్పిన మాట ఎవరికి వర్తించినా వర్తించకపోయినా  ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి మాత్రం వర్తించవని అర్ధమైపోతోంది. ఎందుకంటే తాజాగా గుంటూరు లోక్ సభ పరిధిలోని నేతలతో జూమ్ కాన్ఫరెన్సు సందర్భంగా చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. నేతలతో చంద్రబాబు మాట్లాడుతూ జగన్ కు 10 నుండి 30 ఏళ్ళ వరకు జైలుశిక్ష పడుతుందని చెప్పటమే విచిత్రంగా ఉంది.  మీటింగ్ పెట్టిందే పార్టీ బలోపేతం గురించి మాట్లాడేందుకు. మరి మాట్లాడిందంతా జగన్ గురించే. వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు, జగన్ పై విమర్శలతోనే విలువైన కాలాన్ని చంద్రబాబు గడిపేస్తున్నాడు. పొద్దున లేచింది మొదలు రాత్రయ్యే వరకు జగన్నే టార్గెట్ చేసుకుని చంద్రబాబు పదే పదే ఎందుకు మాట్లాడుతున్నట్లు ?




ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో తనను జగన్మోహన్ రెడ్డి కొట్టిన దెబ్బను చంద్రబాబు ఇంకా మరచిపోలేకున్న విషయం అర్ధమైపోతోంది. రాజకీయాలన్నాక గెలుపోటములు అత్యంత సహజం అన్న విషయం ఈ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ  మరచిపోయినట్లున్నాడు. 2014 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్ అసలు చంద్రబాబు ఊసే ఎత్తలేదు. మళ్ళీ ఐదేళ్ళపాటు టీడీపీ ప్రభుత్వంపై ఎలాంటి పోరాటాలు చేయాలనే విషయంపైనే నేతలతో  సమీక్షలు పెట్టేవాడు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పులపై నేతలను జనాల్లోకి వెళ్ళాలని, తాను ఏమి చేయబోతున్నాను అనే విషయాలనే జగన్ చర్చించేవారు. నేతల సమీక్షలో అందరి అభిప్రాయాలను విన్న తర్వాత తగిన కార్యాచరణను రెడీ చేసేవాడు. 




ప్రతిపక్ష నేతంటే అవకాశం ఉన్న ప్రతిసారి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేట్లుగా వ్యవహరించాలే కానీ 24 గంటలూ పదే పదే ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు చేస్తుంటే జనాల్లో పలుచనైపోతాననే విషయం జగన్ కు బాగా తెలుసు. పైగా జగన్ కున్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏమిటంటే ప్రతిరోజు మీడియాలో కనబడాలనే కోరిక లేకపోవటమే. జగన్ కు మీడియాలో కనబడాలనే బలహీనత లేకపోవటం వల్లే జనాల ముందు పలుచన కాలేదు. కానీ చంద్రబాబు ఆ బలహీనతను జయించలేకపోతున్నాడు. ప్రతిరోజు మీడియా సమావేశాలో నిర్వహించటమో లేకపోతే నేతలతో టెలికాన్ఫరెన్సులనో లేదా జూమ్ లో సమీక్షలనో గంటల కొద్దీ మాట్లాడుతున్నాడు. తర్వాత తాను మాట్లాడిందంతా మీడియాలో వచ్చేట్లు చూసుకుంటున్నాడు. దీని వల్ల ప్రతిరోజు ఏదో ఓ కారణంతో జగన్ పై ఆరోపణలు, విమర్శలతో చంద్రబాబును చూసి చూసి జనాలకు కూడా విసిగెత్తిపోతోంది.




జగన్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపాల్సిందే. ఆ తప్పులను ఎత్తిచూపటంలో ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ నిర్మాణాత్మకమైన పాత్రను పోషించటం లేదు.  ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎవరో ఒకరిపై దాడులు జరుగుతునే ఉంటాయి. స్త్రీలపై దాడులు జరుగుతునే ఉంటాయి. బాధ్యులపై ప్రభుత్వాలు యాక్షన్ తీసుకుంటున్నా మళ్ళీ మళ్ళీ ఘటనలు జరుగుతున్న మాట వాస్తవమే. చంద్రబాబు హయాంలో కూడా ఎస్సీలు, మహిళలపై దాడులు, అఘాయిత్యాలు జరగలేదా ? అటువంటి సంఘటనలే ఇప్పుడూ జరుగుతుంటే ఎస్సీలపై దాడులు, మహిళలపై అత్యాచారాలంటూ నానా గోల చేస్తున్నారు. పోలీసులను పదే పదే టార్గెట్ చేసున్నారు. దేవాలయాలను ప్రభుత్వం కూల్చేస్తోందంటూ గోల చేస్తున్నారు. నిజానికి తన హయాంలోనే రాత్రికి రాత్రి విజయవాడలో చంద్రబాబు 35 గుళ్ళని కూల్చేసిన విషయం అందరికీ గుర్తే. జగన్ కు వ్యతిరేకంగా చంద్రబాబులో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది. మరి పెరిగిపోతున్న ఫ్రస్ట్రేషన్ దేనిక గుర్తు ?


మరింత సమాచారం తెలుసుకోండి: