నాటి నుంచి కూడా ప్రశాంత్ కిషోర్ సోషల్ మీడియాలో ఎక్కువగా టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్ళారు. సోషల్ మీడియాలో ఉన్న చాలా మందిని ప్రోత్సహించడానికి ఒక విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఇప్పుడు తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ కూడా అదే విధంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని కొంతమంది కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కొన్ని కొన్ని అంశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారుతున్నాయి. కాబట్టి సీఎం కేసీఆర్ కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అనే భావన చాలా వరకు కూడా వ్యక్తమవుతుంది.
సోషల్ మీడియా విషయంలో కొన్ని విధానాలను తెలంగాణలో కూడా ప్రవేశపెడితే ప్రజల్లోకి బలంగా వెళ్లే అవకాశం ఉండవచ్చు. ప్రశాంత్ కిషోర్ అప్పట్లో అమలు చేసిన వ్యూహాలు ముఖ్యమంత్రి జగన్ కు బాగా పనిచేస్తాయి. కాబట్టి సీఎం కేసీఆర్ కూడా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ విషయంలో సీరియస్ గా ఉన్నారు అని త్వరలోనే మంత్రి కేటీఆర్ ఆయనతో సమావేశం కావచ్చని అంటున్నారు. మంత్రి కేటీఆర్ సమావేశమై తెలంగాణలో తమకు ఏ విధంగా ఇప్పుడు ముందుకు వెళితే మంచిది అనే అభిప్రాయం చెప్పే అవకాశం ఉందని ఈ విషయంలో ప్రశాంత్ కిషోర్ సహకారం ఉంటే ఆయనకు కూడా సహకరించడానికి రెడీ అవుతున్నారు అని అంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి