
అందులో చిన్న పులులు ఎక్కువ మరణిస్తుండటం ఆందోళన కలిగించే విషయం. కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 661 పులులు చనిపోతే సహజేతర కారణాలతో 520 పులులు చనిపోతే 121 పులులను వేటాడి చంపేశారు. సహజంగా చనిపోయిన 19 పులులు చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే సహజంగా చనిపోవడం, వృద్ధాప్యం కారణంగా చనిపోతే దానికి ఎవరూ ఏమీ చేయలేరు.
పర్యావరణాన్ని రక్షించడంలో పులుల పాత్ర కూడా ఉంటుంది. గతంలో అలాంటి అడవుల్లో పులి ఉందంటే వెళ్లడానికి భయపడతారు. ముఖ్యంగా అక్కడి అటవీ సంపద రక్షణలో పులి పాత్ర అలాంటిది. కానీ ఇప్పుడు పులులనే వేటాడి చంపేస్తున్నారు. దాని చర్మానికి ఉన్న డిమాండ్ తో దేశ విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దీనికి వేటగాళ్లు వలలు పెట్టడం.. జీ వైర్లలో ఉరి వేసి బిగించడం లాంటి పనులు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల అనేక పులులు మృత్యువాత పడుతున్నాయి.
పెద్ద పులి సగటు జీవిత కాలం 10-12 ఏళ్లు ఉంటే చాలా సమయాల్లో అది ముందుగానే మరణించడం ఆందోళనకరం. అందుకే అటవీ జంతువుల సంరక్షణకు మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పర్యావరణ వేత్తలు కోరుతున్నారు. లేకపోతే రాబోయే రోజుల్లో పులుల సంఖ్య మరింత తగ్గిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు.