దుర్గా దేవికి అంకితమివ్వబడిన ఈ పండుగను బెంగాల్ రాష్ట్రంలో ఘనంగా జరుపుకుంటారు. అలాగే కర్నాటకలోనూ మైసూరు ఉత్సవాలను దేశంలోనే అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఇప్పటికే బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్ కత్తాతో పాటు దేశంలోని చాలా చోట్ల దుర్గా దేవి దేవాలయాలన్నీ ముస్తాబవుతున్నాయి. నవరాత్రుల వేళలో తొమ్మిదిరోజుల పాటు జరిగే ఈ సుదీర్ఘమైన పండుగకు అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. హిందూ సాంప్రదాయం ప్రకారం అమ్మవారి విగ్రహాలకు తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాలలో పూజించి ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. దుర్గా దేవి విగ్రహాలను కూడా అచ్చం వినాయక విగ్రహాల మాదిరిగానే ఆయా మండపాలలో ప్రతిష్టిస్తారు. అయితే ఇలా ప్రతిష్టించే దుర్గా మాత విగ్రహాలను తయారు చేసేందుకు వేశ్య గృహాల్లోని మట్టిని వాడతారంట. వినడానికి వింతగా ఉన్నప్పటికీ ఇదే నిజమట. అయితే దీని వెనుక కొన్ని రహస్యాలున్నాయట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

సెక్స్ వర్కర్లుగా పని చేసే వారు మరియు వేశ్య గృహాల్లో నివసించే మహిళలను ప్రపంచం తరచుగా చూస్తుండగా, ప్రజలు ఆ ఇంటి నుండి కొంత మట్టిని తీసుకురావాలని వేడుకున్నారట.చాలా మంది ప్రజలు సెక్స్ వర్కర్ల ఇళ్లలోకి వచ్చే సమయంలో తమ పవిత్రతను మరియు కాఠిన్యాన్ని వారి ఇంటి దగ్గరే వదలేసి వస్తారని వారు నమ్ముతారు. వారు వేశ్యగృహం యొక్క తలుపులు దాటిన తర్వాత, వారు పాపం మరియు దుర్మార్గపు ప్రపంచంలోకి ప్రవేశిస్తారు. అందుకే ఈ ఇంట్లోని మట్టిని చాలా పవిత్రంగా భావిస్తారట. దుర్గా దేవి విగ్రహాలను వేశ్యగృహంలోని మట్టిని ఉపయోగించి తయారు చేయడానికి మరో కారణం కూడా ఉందట. అదేంటంటే.. దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించే సమయంలో.. అతను ఆమెను తాకి, వేధించడానికి ప్రయత్నించాడట. దీంతో ఆ దేవతకు కోపం వచ్చి తన శక్తిని మరియు పరాక్రమాన్ని ఉపయోగించి ఆ రాక్షసుడిని సంహరించిందట.

సమాజంలో అగౌరవానికి గురైన మహిళలకు ప్రజలందరూ గౌరవం ఇవ్వడానికి కూడా ఈ వేశ్యగృహం నుండి మట్టిని తీసుకుంటారట. దుర్గాదేవి స్త్రీల యొక్క శక్తిని సూచిస్తున్నందున, వేశ్యగృహాల్లోని వారితో సమాజంలోని అట్టడుగు వర్గాల మహిళలను గౌరవంగా చూస్తారని వారు నమ్ముతారు. అంతేకాకుండా ఏ స్త్రీ కూడా అవమానానికి గురికాకూడదని.. స్త్రీల గురించి దుర్భాలాషకూడదని ఇవి సూచిస్తాయట.


మరింత సమాచారం తెలుసుకోండి: