తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఒక ఆధ్యాత్మిక రాజధాని. చెప్పుకోడానికి ఆధ్యాత్మిక రాజధాని అయినప్పటికీ అక్కడ ప్రస్తుతం కులం మతం పేరిట రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. కేవలం ఈ స్థానాన్ని అపవిత్రం చేయడానికే కొన్ని వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టీటీడీ పేరుమీద నకిలీ వెబ్ సైట్ తయారు చేశారు కొందరు. అంతటితో ఆగకుండా తిరుపతి గేమ్ అంటూ ఒక ఆటను కూడా తయారు చేసి సామజిక మాధ్యమాలలో వదిలిపెట్టారు. దీనిని గమనించిన టీటీడీ అది నకిలీది అని స్పష్టం చేసింది.  ఆధ్యాత్మిక రాజధానిపై ఇలాంటి విమర్శలు చేయడం శోచనీయం అని అక్కడి అధికారులు తెలియజేశారు.

తిరుపతి హిల్ క్లైమ్బింగ్ గేమ్, తిరుపతి బస్సు డ్రైవర్ పేరిట ఆన్ లైన్ లో గేమ్ తయారు చేయడాన్ని టీటీడీ విజిలెన్స్ తీవ్రంగా స్పందించింది. కొందరు నీతినియమాలు మరిచి ఆధ్యాత్మిక కేంద్రాన్ని కూడా గేమ్ రూపంలో తయారు చేసి డబ్బులు దండుకోడానికి ప్రయత్నిస్తున్నారని అధికారులు విమర్శించారు. టీటీడీ దీనిపై దర్యాప్తుకు ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా టీటీడీ నకిలీ వెబ్ సైట్, ఆన్ లైన్ గేమ్ రూపొందించినట్టు అధికారులు తేల్చారు. ఈ చర్యకు పూనుకున్న వరదాచారి అనే వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. సదరు నకిలీ వెబ్ సైట్, గేమ్ లతో టీటీడీ కి సంబంధం లేదని, ఎవరైనా వాటిని నమ్మి మోసపోతే తమది బాధ్యత కాదని సూచిందింది.

వివరాలలోకి వెళితే, తిరుమల ఘాట్ రోడ్ పై బస్సు డ్రైవర్ పేరుతో ఆన్ లైన్ గేమ్ రుపొందించారు. అలిపిరి గరుడ విగ్రహం నుండి కొండపైకి మరియు తిరిగి తిరుపతికి ఘాట్ రోడ్ లో ప్రయాణించేలా ఈ గేమ్ రూపొందించారు. టెక్ మేడ్స్ లో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి రెండేళ్లు కష్టపడి ఈ గేమ్ రూపొందించాడు.  అనంతరం గూగుల్ ప్లే లో అందుబాటులోకి వచ్చేసింది. దీనితో ఈ విషయం టీటీడీ వరకు వెళ్లడం విజిలెన్స్ వాళ్ళు తగిన చర్యలకు ఉపక్రమించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: