రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి. ఈ పండుగను మూడు రోజులు జరుకుంటారు. పండించిన పంట మొత్తం ఇంటికి చేరడంతో ఈ పండగని జరుపుకుంటారని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. సంక్రాంతి పండగను ఏపీలో పెద్ద ఎత్తులో జరుపుకుంటూ ఉంటారు. ఇక ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఈ పండగను నాలుగు రోజులపాటు ఘనంగా నిర్వహించుకుంటారు.

అయితే సూర్యుడు మకరరాశిలో ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండగ జరుపుకుంటారు. ఇక భోగి మంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందెలు, ఇంటి ముందు గొబ్బెమ్మలు ఇలా ఒక్కటేమిటీ సంక్రాంతి సందడి కోలాహలంగా కనిపిస్తూ ఉంటుంది. కాగా.. సంక్రాంతి, భోగి, కనుమ ఈ మూడు రోజులు ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఎంతో అందంగా ముగ్గులు వేసి రంగులతో నింపి మధ్యలో గొబ్బెమ్మలు పెడుతారు. ఇది అందరికి తెలిసిన విషయమే అయినప్పటికీ సంక్రాంతి రోజునే ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలు ఎందుకు పెడతారో ఎవరికీ తెలియదు. ఇంతకీ గొబ్బెమ్మలు ఎందుకు పెడుతారో ఒక్కసారి చూద్దామా.

ఇక ఈ మూడురోజుల పండగలో మొదటి రోజు భోగిని జరుపుకుంటారు. అలాగే రెండో రోజును మకర సంక్రాంతిగా.. మూడో రోజును కనుమ పండుగను జరుపుకుంటారు. అయితే సంక్రాంతి రోజున ముగ్గులు వేసి రంగులతో అందగా అలంకరించి వాటి మధ్యలో గొబ్బెమ్మలు పెట్టడం ఆనవాయితీగా వస్తుంది.

తెలుగు రాష్ట్రాల సంప్రదాయం ప్రకారం.. గొబ్బెమ్మలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. తెలుగు ప్రజలు గొబ్బెమ్మను గౌరిమాతగా భావిస్తుంటారు. ఇంటి ముందు ముగ్గులో గొబ్బెమ్మను పసుపు, కుంకుమ పూలతో అలంకరించి పూజిస్తే.. పుణ్య స్త్రీతో సమానం అని భావిస్తారు. అంతేకాదు.. లక్ష్మి దేవికి సైతం గొబ్బెమ్మలు అంటే చాలా ఇష్టమని భావిస్తారు. ఇక అందుకే.. పండగ రోజున ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలను పెడితే ఇంట్లో లక్ష్మీ దేవిని ఆహ్వానించినట్టు అని ప్రజలు నమ్ముతుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: