నరదృష్టి అనేది మన భారతదేశంలో పురాతన కాలం నుంచి సంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి ఒక పరిణామం. దిష్టి తగిలినప్పుడు దాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా తీసివేస్తారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఇది దిష్టి అనేది తగులుతుందని చెబుతుంటారు. చిన్న పిల్లలు ఉన్న దగ్గరికి చాలా మంది వచ్చారు అనుకోండి. అలా వచ్చినప్పుడు చిన్న పిల్లలు చాలామంది ఎత్తుకుంటారు. ఈ సందర్భంలో పిల్లలు చాలా నలిగిపోయి బాగా ఏడుస్తూ ఉంటారు. పిల్లల విషయంలో మరి ఏ విధంగా కాని దృష్టి తగిలిందని చెబుతూ ఉంటారు. ఇందులో మరీ ముఖ్యంగా పిల్లలకు ఎక్కువగా తల్లి దిష్టి కూడా తగ్గుతుందని అంటుంటారు. ఇలాంటివి ఎన్నో మనం చూస్తూ ఉంటాం.. వింటూ ఉంటాం.. మరి అది దిష్టి అనేది నిజంగానే ఉంటుందా తెలుసుకుందాం..! మన శరీరం బయట ఒక కాంతి శరీరం అనేది ఉంటుందని చెబుతూ ఉంటారు. దీన్ని ఆరా అంటాం. కొన్ని దేవతల ఫోటోలు చూస్తే దాని వెనకాల మెరుపు వచ్చినట్టు కనిపిస్తుంది.

అయితే మానవ శరీరం వెలుపల కూడా అలాగే ఉంటుందని నమ్ముతారు. ఈ సందర్భంలో ఎవరైనా మనల్ని పదేపదే చూసిన, మన గురించి మాట్లాడిన శరీరాన్ని దాటి ఉన్నటువంటి ఆ కాంతి శరీరం నుంచి కొంచెం బ్రేక్ అవుతుంది అని చెబుతారు. ఇలా బ్రేక్ అవ్వడం వలన శరీరానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ క్రమంలో దిష్టి తీసే ప్రక్రియను  ఆరా పుల్లింగ్ అంటారు. ఈ సందర్భంలో ఈ ఆరా పుల్లింగ్ చేస్తే ఎంతో బిగుసుకుపోయిన మన శరీరం తేలిక అయినట్టు మనకు భావన కలుగుతుంది. దీన్నే దిష్టి తీయడం అంటారు. ఇందులో దాదాపు పాతిక రకాల దిష్టి లు ఉన్నాయి. కొబ్బరికాయతో తిప్పడం, ఉప్పుతో దిష్టి తీయడం, అలాగే కర్పూరం బిళ్ళతో, పిడకలతో, పేడ ముద్దతో, బొగ్గుతో, కోడి గుడ్లతో, ఎండుమిర్చితో, వెంట్రుకలు, ఆవాలు, ఇంకా రకరకాల వాటితో దిష్టి అనేది తీస్తూ ఉంటారు.

ఈ విధంగా శరీరం బయట ఉన్నటువంటి కాంతి వలయాన్ని ఫుల్ చేయడం ద్వారా శరీరం కాస్త తేలిక పడుతుందని నమ్ముతారు. ముఖ్యంగా మనకు ఏదైనా అనారోగ్యం సంభవించినప్పుడు అది దిష్టి ద్వారా అయితే మాత్రం ఎర్ర నీళ్లు లేదా కొబ్బరి కాయలతో  తీస్తారు. ముఖ్యంగా కొబ్బరికాయతో  దిష్టి తీసి మూడు రోడ్ల కూడలిలో దానిని పగుల కొడతారు. దీని ద్వారా దిష్టి అనేది కొబ్బరికాయకు పోతుందని ఆ కొబ్బరికాయను ఎవరైనా ముట్టుకుంటే దృష్టి వారికి తగులుతుందని నమ్ముతారు. కానీ మన నుంచి  సమస్య మిగతా వారికి తగిలితేనే ఆ సమస్య తగ్గుతుందనేది చాలా తప్పు.

మరింత సమాచారం తెలుసుకోండి: