ఎన్నో ఏళ్ల నుంచి హిందువులందరూ కూడా వెయ్యికలతో ఎదురుచూస్తున్న అయోధ్యలో రామ మందిర నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమం ఇటీవల అట్టహాసంగా జరిగింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హిందువుల కళ నెరవేరింది. ఏకంగా బాల రాముడు విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్టించారు. ఈ క్రమంలోనే దేశ నలుమూలల నుంచి కూడా తండోపతండాలుగా భక్తులు శ్రీరాముడి దర్శనం కోసం అయోధ్యకు తరలి వెళ్తున్నారు అని చెప్పాలి. అయితే ఇక  రామ మందిరం ప్రారంభోత్సవం ఈ నెల 22వ తేదీన జరిగింది. కాగా ఇప్పటికి కూడా ఈ రామ మందిర నిర్మాణం గురించి, గుడిలో ప్రాణ ప్రతిష్ట చేసిన విగ్రహం గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూనే ఉంది.



 అయితే నల్లటి రాముడు విగ్రహాన్ని గుడిలో ప్రాణ ప్రతిష్ట చేశారు అన్న విషయం తెలిసిందే. అయితే ఎందుకు ఇలా గుడిలో నల్లటి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇంట్లో కూడా ఇలాంటి నలుపు రంగులో ఉన్న విగ్రహాన్ని పెట్టుకోవచ్చా అని ఎంతో మంది చర్చించుకుంటున్నారు. అయితే ఈ విషయంపై పండితులు కీలక వ్యాఖ్యలు చేశారు. రామాయణంలో శ్రీరాముని నల్లని రంగు గురించి చర్చించారని.. అందుకే రాములల్ల విగ్రహాన్ని తయారు చేసిన సమయంలో విగ్రహ రూపకర్త అరుణ్ యోగిరాజ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని పండితులు చెబుతున్నారు. విష్ణుమూర్తికి సంబంధించిన అన్ని అవతారాలు ఆయన విగ్రహంలో చూపించగా.. ఇక ఆయన రామాయణం ఆధారంగా విగ్రహాన్ని ముదురు రంగులో ఉందని చెప్పారు. రాముల విగ్రహాన్ని తయారు చేసిన రాయి నలుపు రంగులో ఉంటుంది.


 ఇక ఈ శ్రీరాముడి విగ్రహం చాలా సంవత్సరాలుగా అలాగే ఉంటుంది. అందుకే నలుపు రంగు రాయితో తయారు చేసిన విగ్రహాన్ని గుడిలో ప్రతిష్టించారు అంటూ పండితులు చెప్పుకొచ్చారు. అయితే ఇలాంటి నలుపు రంగు విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా వద్దా అనే విషయంపై కూడా పండితులు క్లారిటీ ఇచ్చారు. మాతా ఖాళీ, బైరవనాధ్, శని దేవుని విగ్రహాలు నలుపురంలో ఉంటాయని గ్రంథాలు శాస్త్రాల ప్రకారం నల్లని విగ్రహాలు ఇంట్లో ఉంచడం కీడుగా ఎంతోమంది భావిస్తారని పండితుడు తెలిపారు. ఇంట్లో కాకుండా గుడిలో విగ్రహాన్ని ప్రతిష్టించి పూజించవచ్చు అంటూ స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: