సాధారణంగా ఈ ప్రశ్న ప్రతి ఒక్కరికి ఉంటుంది . మన ఇంట్లో అమ్మమ్మలు తాతలు, పెద్దవాళ్లు ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ బంగారు వస్తువులు ఉంటాయి. అవి ఈజీగా పడేయలేము. వాళ్లకు సంబంధించిన మిగతా వస్తువులు ఏవైనా సరే పడేస్తారు కానీ చనిపోయిన వారి బంగారు వస్తువులను మాత్రం అస్సలు పడేయరు . అయితే ఆ బంగారు వస్తువులను బ్రతికున్న వారు పెట్టుకోవచ్చా..? చనిపోయిన వారి బంగారు వస్తువులను బ్రతికున్న వారు పెట్టుకుంటే ఏం జరుగుతుంది..? మంచిదా..? చెడ్డదా..? అసలు మన శాస్త్రం ఏమి చెబుతుంది అనే విషయాలు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకుంటే చనిపోయిన వారు ఉపయోగించిన బంగారు వస్తువులు లేదా ఇతర ఏ వస్తువులు కూడా వాడకపోవడమే మంచిది అంటున్నారు పండితులు.  మరీ ముఖ్యంగా చనిపోయిన వారి బంగారు వస్తువులు బ్రతికున్న వారు అస్సలు వాడకూడదట.  ఎందుకంటే బంగారం అనేది సూర్య గ్రహానికి సంబంధించింది . ఆభరణాలకు సూర్యశక్తి వాళ్ళు చనిపోయిన తర్వాత తగ్గిపోతుంది. కాబట్టి మరణించిన వారి బంగారు వస్తువులు వేరే వారు వేసుకోవడం వల్ల వాళ్లకి ప్రతికూల ప్రభావాలు పెరుగుతాయి అంటున్నారు పండితులు.

మరీ ముఖ్యంగా ఆరోగ్యం ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతింటుందట . అంతేకాదు ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారో పెళ్లి కావాలి అంటూ వెయిట్ చేస్తున్నారో. అలాంటి వాళ్ళు చనిపోయిన వాళ్ళ బంగారం అసలు వేసుకోకూడదట.  అంతే కాకుండా చనిపోయిన వారి బంగారం వాడితే వారి ఆత్మకు శాంతి లభించదట.  గరుడ పురాణం ఇలానే చెబుతుంది గ.  వారి ఆత్మ ఎప్పుడు జీవించి ఉన్న వ్యక్తులపై ఉంటుందట . అది దోషానికి దారి తీసే ప్రమాదం కూడా ఉంటుంది అంటున్నారు పండితులు.  కావాలంటే వస్తువులను గుర్తుగా ఒక చోట ఉంచుకోవడం మంచిది . అది ఏ నష్టాన్ని కలిగించదు . కానీ చనిపోయిన వారి వస్తువులను మనం వాడితే మాత్రం అది పూర్తి నెగిటివ్గా మారిపోతుంది అంటున్నారు జ్యోతిష్య పండితులు.  వాళ్ళ గుర్తుగా వస్తువులను ఏదైనా బాక్స్ లో జాగ్రత్త పరుచుకోవచ్చు..!!

నోట్: ఇక్కడ అందించిన సమాచారం కేవలం కొందరు పండితులు చెప్పిన విషయాలు ఆధారంగానే ఇవ్వబడింది . ఇది ఎంతవరకు విశ్వసించాలి అనేది మాత్రం పూర్తిగా మీ వ్యక్తిగతమని పాఠకులకు గుర్తుంచుకోవాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: