క్రిస్ గేల్... టీ-20 ఫార్మెట్లో సునామీ లాంటి బ్యాట్స్మెన్... విధ్వంసకర ఇన్నింగ్స్  తో బౌలర్ల వెన్నులో వణుకు పుట్టించే బ్యాటింగ్ చేయగల సత్తా క్రిస్ గేల్ సొంతం. ఒక్కసారి మైదానంలో కుదురుకున్నాడు అంటే భారీ  సిక్సుల వర్షం కురుస్తూనే ఉంటాడు. స్కోర్ బోర్డు పరుగులు పెడుతూనే ఉంటుంది. క్రిస్ గేల్ తమ జట్టులో ఉంటే ఇక ఎంతో ధీమాగా ఉండవచ్చు అని అనుకుంటారు ఏ ఆటగాడైనా. ప్రస్తుతం ఐపీఎల్ లో కింగ్స్ ఎలెవన్  పంజాబ్ తరఫున క్రిస్ గేల్ ఆడుతున్న విషయం తెలిసిందా. అయితే ఇప్పటి వరకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రెండు మ్యాచ్లు ఆడింది.



 కానీ రెండు మ్యాచ్ ల్లో కూడా విధ్వంసకర బ్యాట్స్మెన్ క్రిస్ గేల్ కి కనీసం అవకాశాన్ని కూడా ఇవ్వలేదు. తొలి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ తో పోరాడి ఓడిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్... నిన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పై జరిగిన మ్యాచ్ లో అద్భుత విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఐపీఎల్ పట్టిక లో  టాప్ ప్లేస్ లోకి వచ్చింది పంజాబ్ జట్టు. పంజాబ్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు అన్న విషయం తెలిసిందే. కానీ క్రిస్ గేల్ ని  అసలు ఎందుకు పక్కన బెడుతున్నారు అనే చర్చ ప్రస్తుతం మొదలైంది. పంజాబ్ జట్టు కెప్టెన్ రాహుల్ ని పెద్ద ఎత్తున అభిమానులు ఇదే ప్రశ్న అడగటం మొదలుపెట్టారు.



 తాజాగా పంజాబ్ జట్టు కెప్టెన్ రాహుల్ దీనిపై సమాధానమిస్తూ అందరికీ క్లారిటీ ఇచ్చారు. సరైన సమయంలో క్రిస్ గేల్ ని  టీమ్ లోకి తీసుకుంటామని రాహుల్ చెప్పుకొచ్చాడు. అతని గురించి ఎవరూ కంగారు పడవద్దు అని సూచించాడు. చాలా రోజులు ఇంటి దగ్గరే ఉన్న తర్వాత మళ్ళీ ఐపీఎల్ రూపంలో మ్యాచ్ లు  ఆడే అవకాశం లభించింది. కాబట్టి ప్రతి ఒక ఆటగాడు మ్యాచ్ లను  ఎంజాయ్ చేస్తున్నారు అంటూ కె.ఎల్.రాహుల్ వెల్లడించారు. ఇక రాహుల్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే త్వరలో క్రిస్ గేల్ తుది జట్టులో స్థానం సంపాదించుకోవడం ఖాయం అని కొంతమంది అభిమానులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: