మిగతా టోర్నీలు ఎలా ఉన్నప్పటికీ ఒలంపిక్స్ లాంటి మెగా టోర్నీలో మాత్రం ప్రతి ఒక అథ్లెట్ కూడా..  పథకం సాధించాలనే కసితో ఉంటాడు. ఈ క్రమంలోనే  అత్యున్నతమైన ప్రతిభను కనబరుస్తూ  ఉంటారు ప్రతి ఒక్కరు .  ఇలాంటి సమయంలో కొంతమంది దిగ్గజ ఆటగాళ్లకు సైతం చేదు అనుభవం ఎదురవుతుంది. సాధారణంగా అప్పుడే ఒలంపిక్స్ లో ఎంట్రీ ఇచ్చిన అనుభవం లేని ఆటగాళ్లు సైతం పథకం గెలిస్తే.. కొంతమంది దిగ్గజ ఆటగాళ్లు మాత్రం వరుసగా నిరాశ చెందుతూ ఉంటారు.  ఇక ఇటీవలే టెన్నిస్ దిగ్గజం ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు నోవాక్ జకోవిచ్ కి ఇలాంటి నిరాశే ఎదురవుతుంది.



 ప్రస్తుతం టెన్నిస్ క్రీడలో ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు గా కొనసాగుతున్నాడు నోవాక్ జకోవిచ్. ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు తెలియని క్రీడా అభిమాని లేడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటివరకు ఏకంగా 20 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలుచుకుని టాప్ లో కొనసాగుతున్నాడు. ఇంకా ఒక్క గ్రాండ్ స్లామ్  టైటిల్ గెలిచాడు అంటే ప్రస్తుతం టెన్నిస్ లో దిగ్గజాలు గా  కొనసాగుతున్న రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్ను కూడా అధిగమించేస్తాడు జకోవిచ్. ఇలా తన ఆటతో  ప్రేక్షకులందరినీ ఉర్రూతలూగిస్తూ సరికొత్త చరిత్రకు నాంది పలుకుతున్నాడు. ఇక  జకోవిచ్ తో మ్యాచ్  అంటే చాలు ప్రత్యర్థి ఆటగాడి వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది.


 ఇలాంటి ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు కి అటు ఒలంపిక్స్ లో  మాత్రం వరుసగా నిరాశే ఎదురవుతుంది. ఈ సెర్బియా ఆటగాడికి ఒలంపిక్స్ లో బంగారు పథకం అందని ద్రాక్షలా ఊరిస్తుంది. ఇక ఒలంపిక్స్ లో పోటీపడ్డ ప్రతీసారి ఈ ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడికి నిరాశే ఎదురవుతుంది. ఇప్పటివరకు ఒలంపిక్స్ లో కేవలం ఒకే పతకం సాధించాడు నోవాక్ జకోవిచ్. అదికూడా కాంస్య పథకం కావడం గమనార్హం. ఈసారి టోక్యో ఒలింపిక్స్ లో ఎలాగైనా పసిడి పతకాన్ని సాధించాలి అని అనుకున్నాడు. ఆడిన ప్రతి మ్యాచ్ లో కూడా అద్భుత ప్రతిభ కనబరుస్తూ విజయం సాధిస్తూ వచ్చాడు. కానీ ఇటీవలే ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు కి భంగపాటు ఎదురైంది. సెమీఫైనల్స్ లో జర్మనీకి చెందిన అలెగ్జాండర్  అనే ఆటగాడి చేతిలో వరుస సెట్లలో కూడా ఓటమి పాలయ్యాడు జొకోవిచ్. ఇక ఓటమిని అస్సలు జీర్ణించుకోలేకపోయాడు. దీంతో కోపంతో మ్యాచ్ అనంతరం సహనం కోల్పోయాడు. తన రాకెట్ ను నెట్ పోల్ కు విసిరికొట్టాడు. ఇక రాకెట్ పూర్తిగా విరిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: