టీ 20 ప్రపంచకప్‌లో తొలిసారి భారత్‌పై పాకిస్థాన్‌ విజయం సాధించింది. దాంతో ప్రస్తుతం పాకిస్థాన్ మొత్తం కెప్టెన్ బాబర్ ఆజమ్‌ని హీరోగా పరిగణిస్తోంది. అయితే బాబర్ ఆజమ్ తన వ్యక్తిగత జీవితంలో చాలాసార్లు వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఇక తనను తాను బాబర్ ఆజమ్ లవర్ గా అభివర్ణించుకునే హమీజా ముఖ్తార్ ఇప్పుడు తాజాగా మరోసారి తెరపైకి వచ్చారు. బాబర్ పెళ్లికి హామీ ఇచ్చి తనను లైంగికంగా వేధించాడని మరియు ఇప్పుడు వివాహాన్ని తిరస్కరించాడని పేర్కొంది హమీజా. అలాగే బాబర్ బిడ్డకు తాను తల్లి కాబోతున్నట్లు కూడా తెలిపింది.

అయితే హమేజా బాబర్ చేసిన దానికి పాకిస్తాన్ కోర్టును ఆశ్రయించింది. అక్కడ పాకిస్తాన్ కెప్టెన్‌పై చిత్రహింసల కేసును దాఖలు చేసింది. అయితే ఈ చిత్రహింసల కేసు లాహోర్ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న సమయంలో మొత్తం వివాదాన్ని పరిష్కరించేందుకు బాబర్ కుటుంబం తనకు రూ.20 లక్షలు ఆఫర్ చేసిందని కూడా ఆమె గతంలో చెప్పిన విషయం తెలిసిందే. అయితే బాబర్ తనను లైంగికంగా వేధించాడని, డబ్బు కోసం మోసం చేశాడని హమేజా ఆరోపించింది. తాను, బాబర్  ప్రేమించుకున్నామని, 2011లో ఇంటి నుంచి పారిపోయామని చెప్పింది. ఆ సమయంలో ఇద్దరం లాహోర్‌లోని అనేక ప్రాంతాలలో కలిసి ఉన్నామని అంది. 10 ఏళ్ల క్రితం ఈ ప్రేమ మొదలైనప్పుడు మేము ఇద్దరం మైనర్లమే అని హమీజా చెప్పింది. దీనికి సంభందించిన అనేక సాక్ష్యాలను కూడా హమేజా చూపించింది.

హమీజా తన చేతిలో పవిత్ర ఖురాన్ పట్టుకుని... 2011లో తన కుటుంబం సంబంధానికి అంగీకరించకపోవడంతో పెళ్లి చేసుకునేందుకు ఇంటి నుంచి పారిపోయానని హమీజా పేర్కొంది. అలాగే బాబర్ నన్ను తన స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లాడు, అక్కడ మేము చాలా రోజులు కలిసి ఉన్నాము. మా బంధం కొనసాగాలని బాబర్‌ను పెళ్లి చేసుకోవడానికి మా ఇంట్లో నుండి రెండు లక్షల రూపాయల విలువైన నగలు దొంగలించి తీసుకు వచ్చాను. నేను బాబర్ కోసం నా కారును కూడా అమ్మి అతనికి 12 లక్షలు ఇచ్చాను. ఇంత డబ్బు ఇచ్చిన బాబర్ నాతో ఎప్పుడూ గొడవలు పడేవాడు’ అంటూ హమేజా వెల్లడించాడు. ఇక నేను అతని బిడ్డకు తల్లి అయ్యేదానిని... కానీ బాబర్ ఒత్తిడితో అబార్షన్ చేయించుకోవలసి వచ్చిందని కూడా ఆమె చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: