ప్రస్తుతం ప్రపంచ కప్ లో ఉన్న జట్లలో అపజయమెరుగని జట్లు రెండే రెండు ఒకటి ఇంగ్లాండ్, మరొకటి పాకిస్తాన్. ఇంగ్లాండ్ ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచ్ లలో 4 గెలిచి మంచి ఊపులో ఉండగా, పాకిస్తాన్ సైతం హ్యాట్రిక్ విజయాలను సాధించి ఫుల్ ఫామ్ లో ఉంది. గ్రూప్ 2 నుండి పాక్ ఈ మ్యాచ్ గెలిస్తే సెమీస్ చేరుతుంది, కానీ గ్రూప్ 1 నుండి నిన్న శ్రీలంకతో గెలిచిన ఇంగ్లాండ్ సెమీస్ లో అడుగు పెట్టిన మొదటి జట్టుగా రికార్డు సృష్టించింది. కాగా పాకిస్తాన్ తన నాలుగవ మ్యాచ్ లో నమీబియా తో ఆడుతోంది. మొదట టాస్ గెలిచిన పాకిస్తాన్ అనూహ్యంగా బ్యాటింగ్ ఎంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఒకవేళ ఇదే విధంగా ఇండియాతో జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్ తీసుకుని ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఇప్పుడు బరిలో ఉన్న మొత్తం జట్లలో పాకిస్తాన్ అన్ని విభాగాలలో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ అందరి చేత ప్రశంసలు అందుకుంటోంది. కానీ నమీబియాను అంత తేలిగ్గా తీసుకోవడానికి వీలు లేదు. బ్యాటింగ్ లో కొంచెం తడబడుతున్నా బౌలింగ్ మాత్రం కట్టుదిట్టంగా ఉందన్న విషయం తెలుస్తోంది. లక్కీగా పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఈ అవకాశాన్ని నమీబియా టీం ఉపయోగించుకోవలసిన అవసరం ఉంది. పాక్ ను అతి తక్కువ స్కోర్ కు  కట్టడి చేసి ఎలాగైనా ఆ స్కోర్ ను చేధించగలిగితే అదే వరల్డ్ కప్ కొట్టినంత పేరును నమీబియాకు తీసుకొస్తుంది.

అయితే ప్రస్తుతం అతి భీకరంగా ఉన్న పాక్ ను తక్కువ స్కోర్ కు నమీబియా కట్టడి చేయగలదా అన్నది సందేహమే. అయితే ఎవరి గేమ్ ఏ రోజు ఎలా ఉంటుందో ఎవ్వరూ ఊహించలేము. ఏమీ సంచలనం జరగొచ్చు చెప్పలేము. ఏది ఏమైనా ౧౫౦ లోపు చేజింగ్ చేయగలదు. అంతకు మించి అంటే కష్టమే. మరి ఏమి జరుగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: