ప్రస్తుతం క్రికెట్ ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్నా ఐపీఎల్ మెగా వేలం మరికొన్ని రోజుల్లో జరగబోతుంది. దీనికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది బీసీసీఐ. ఈ క్రమంలోనే రోజురోజుకు ఈ ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెరిగిపోతుంది. అయితే ప్రస్తుతం ఐపీఎల్ లో ఎంతోమంది ఆటగాళ్లు మెగా వేలంలో కొనసాగుతూ ఉండడం గమనార్హం. దీంతో ఈసారి మెగా వేలం లో ఎంతో మంది ఆటగాళ్లు రికార్డు స్థాయిలో ధర పలక బోతున్నారు  అన్నది అర్థమైంది. అయితే మెగా వేలానికి ముందు ఇప్పటికే అన్ని జట్లు కూడా తమతో పాటు అంటిపెట్టుకునే ఆటగాళ్ల వివరాలను ప్రకటించాయ్. అంతేకాకుండా ఐపీఎల్ లో కి కొత్త జట్లు వస్తూ ఉండగా ఇక ఆయా జట్లు కూడా నలుగురు ఆటగాళ్లు రిటైన్ చేసుకోవాల్సి ఉంది. ఇక ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మరికొన్ని రోజుల్లో మెగా వేలం ప్రారంభం కాబోతోంది. ఫిబ్రవరి మొదటివారంలో మెగా వేలం ఉండే అవకాశం ఉంది అంటూ అటు టాక్ వినిపిస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే మరికొన్ని రోజుల్లో మెగా  జరుగుతుంది అనుకుంటున్న సమయంలో ఇటీవల ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ అభిమానులందరికీ షాకిచ్చాడు.. ఐపీఎల్ మెగా వేలానికి ముందు కీలక ప్రకటన చేశాడు ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్.


 ఫిబ్రవరి లో జరగబోయే ఐ.పి.ఎల్ మెగా వేలం నుంచి తాను తప్పుకుంటున్నట్టు ఇటీవల ప్రకటించాడు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేశాడు. అయితే ఇప్పటి వరకు ఐపీఎల్ లో పాల్గొననీ జో రూట్ ఇక ఈ సారి మాత్రం మెగా వేలంలో పాల్గొనీ ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఇటీవలే ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్లో ఘోర ఓటమి తర్వాత ఐపీఎల్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు. తన జట్టు కోసం చేయాల్సింది చాలా ఉందని.. అందుకే కుదిరినంత త్యాగం చేస్తున్నాను అంటూ జో రూట్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: