ఇటీవలి కాలంలో టీమ్ ఇండియా వరుసగా మ్యాచుల్లో విఫలమవుతూ వస్తుంది అన్న విషయం తెలిసిందే. టెస్ట్ ఫార్మాట్ వన్డే ఫార్మాట్ అనే తేడా లేకుండా పూర్తిగా విఫలం అవుతూనే ఉంది. ఇటీవలే టి20 వరల్డ్ కప్ లో నిరాశపర్చిన టీమిండియా ఆ తర్వాత స్వదేశంలో  ఆడిన టి 20 సిరీస్ లో మాత్రం అద్భుతంగా రాణించింది అని చెప్పాలి. సౌత్ ఆఫ్రికా పర్యటనలో కూడా ఇదే జోరు ప్రసాదించాలి అనుకుంది టీమిండియా. కానీ సౌత్ ఆఫ్రికా లో మొదటి మ్యాచ్లో విజయం సాధించి ఆత్మ విశ్వాసంతో ఉన్నట్లు కనిపించింది. కానీ ఆ తర్వాత మాత్రం చేతులెత్తేసింది.


 టెస్ట్ సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్లో గెలిచినప్పటికీ ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్ లలో ఓడిపోయి టెస్టు సిరీస్ను చేజార్చుకున్న టీమ్ ఇండియా వన్డే సిరీస్తో కూడా పూర్తిగా మూడు మ్యాచ్ల్లో ఓడిపోయి క్లీన్ స్వీప్ అయింది అన్న విషయం తెలిసిందే. అయితే ఎంతో పటిష్టంగా కనిపించిన టీం ఇండియా  ఇటీవల కాలంలో ఇలా రాణించక పోవడానికి కారణం ఏమిటి అన్నది ఆసక్తికరంగా మారగా.. ఇక తాజాగా ఇదే విషయంపై వెటరన్ బ్యాట్స్మెన్ దినేష్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భారత జట్టులో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ లాగా యువ ఆటగాళ్లను ప్రోత్సహించేవారు లేకపోవడంతోనే టీమిండియా విఫలం అవుతుంది  అంటూ దినేష్ కార్తీక్ చెప్పుకొచ్చాడు.



 మైదానంలో ధోనీ ఇచ్చే సలహాలు ఆటగాళ్లకు ఎంతో కీలకంగా పడతాయని ఇక ధోని సూచనలతో అద్భుతమైన అద్భుతమైన బంతులను విసిరి వికెట్లను తీసుకుంటూ ఉంటారు అంటూ దినేష్ కార్తీక్ చెప్పుకొచ్చాడు. కాగా ఎన్నో మ్యాచ్లకు విరాట్ కోహ్లీ కెప్టెన్ వ్యవహరించినప్పటికీ యువ ఆటగాళ్లకు మాత్రం ధోని నే అద్భుతమైన సూచనలు సలహాలు ఇచ్చే వాడు అంటూ అన్నాడు దినేష్ కార్తీక్. ఇలా ఎంతో మంది యువ ఆటగాళ్లు పూర్తిస్థాయి క్రికెటర్గా ఎదిగేందుకు ధోని అందించిన సహకారం మరువలేనిది అంటూ దినేష్ కార్తీక్ చెప్పుకొచ్చాడు. ఎంతో మంది అభిమానులు కూడా ఇప్పుడు ధోనీ ఉంటే బాగుండేది అని అనుకుంటూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: