భారత క్రికెట్లోకి ధోని వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన విషయం తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నాడు రిషబ్ పంత్. అచ్చం ధోని లాగానే మిడిలార్డర్ బ్యాట్స్మెన్ వికెట్ కీపర్ కూడా కావడంతో రిషబ్ పంత్ ధోని లోటును  తీరుస్తాడు అని  అందరూ అభిమానులు భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. కానీ కెరీర్ మొదలుపెట్టిన నాటి నుంచి నేటి వరకూ కూడా రిషబ్ పంత్ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూనే  ఉన్నాడు. నిలకడ లేమీ కారణంగా ఎప్పుడూ తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటూ  ఉన్నాడు. ఒక్క మ్యాచ్ లో అద్భుతంగా రాణించి భారీ పరుగులు చేసి ప్రశంసలు అందుకున్న రిషబ్ పంత్ ఆ తర్వాత మాత్రం అదే స్థాయిలో రాణించలేక పోతున్నాడు అన్నది ప్రస్తుతం అందరూ అనుకుంటున్న మాట.


 ఇక రిషబ్ పంత్ పేలవమైన ఫామ్  టీమిండియాకు ఎంతో మైనస్ గా మారిపోతుంది అంటూ ఎంతో మంది మాజీ క్రికెటర్లు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా రిషబ్ పంత్ ఆశించిన స్థాయిలో రాణించలేక పోయాడు. ఏదో ఒక మ్యాచ్ లో బాగా రాణించినట్లు అనిపించినప్పటికీ అన్ని మ్యాచ్ల్లో మాత్రం అదే జోరును కొనసాగించలేకపోయాడు. దీంతో మిడిలార్డర్లో సరైన పరుగులు రాకపోవడంతో టీమిండియా ఓటమి చవిచూడాల్సి పరిస్థితి ఏర్పడింది. రిషబ్ పంత్ తన పేలవమైన ఫామ్ తో ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొంటున్నాడు. ఇకపోతే రిషబ్ పంత్ ఆటతీరుపై ఇటీవలే స్పందించిన మాజీ ఆటగాడు గౌతం గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నువ్వు ఖడ్గంతో జీవిస్తే ఖడ్గం తోనే అంతం అవుతావు అంటూ వ్యాఖ్యానించాడు గౌతం గంభీర్. పంత్.. విరాట్ కోహ్లీ లాగా ఎంతో నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించే రకం కాదు రిషబ్ పంత్ నూ అలా మార్చేందుకు టీమిండియా యాజమాన్యం ఎంతగానో ప్రయత్నాలు చేస్తుంది. కానీ దానికి చాలా సమయం పడుతుంది. ఇక రిషబ్ పంత్ ప్రస్తుతం ఎలా ఆడుతున్నాడో అలాగే ఆడితే బెటర్ అంటూ గౌతం గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: