ఎన్నో ఏళ్ల పాటు భారత క్రికెట్ లో సేవలందించిన గౌతం గంభీర్ ఇక అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ అటు ఐపీఎల్లో మాత్రం ప్రేక్షకులను అలరిస్తూనే వచ్చారు. ఇక ఆ తర్వాత ఐపీఎల్ నుంచి కూడా తప్పుకొని రాజకీయాల్లోకి అడుగు పెట్టారు గౌతం గంభీర్. ఇక రాజకీయాల్లో బీజేపీ తరఫున పోటీ చేసి పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించి ప్రస్తుతం పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఇక ఒకప్పుడు క్రికెట్ లో అద్భుతమైన సేవలు అందించిన గౌతం గంభీర్  క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ క్రికెట్ కు సంబంధించిన విషయాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటాడు. ఇక గౌతం గంభీర్ చేసే వ్యాఖ్యలు ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి అన్నది తెలిసిందే. అయితే ఎప్పుడు గౌతం గంభీర్ చేసే ట్విట్ ల కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఇటీవలే గౌతం గంభీర్ చేసిన ట్వీట్ తో అభిమానులు ఆందోళనలో మునిగిపోయారు. కారణం తనకు కరోనా వైరస్ సోకింది అంటూ గౌతం గంభీర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. తనకు కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయని టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ అని వచ్చింది అంటూ తెలిపారు.. ఇక ఇటీవల కాలంలో తనను కలిసిన వారంతా టెస్ట్ చేయించుకోవడంతో పాటు జాగ్రత్తగా ఉండాలని కోరారు గౌతం గంభీర్.


గౌతం గంభీర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇకపోతే ఐపీఎల్లో కి కొత్త గా ఎంట్రీ ఇస్తున్న లక్నో ఫ్రాంచైజీకి మెంటర్ గా వ్యవహరిస్తున్నారు గౌతం గంభీర్. ఇక ఫిబ్రవరిలో ఐపీఎల్ మెగా వేలం జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే గతంలో కోల్కతా నైట్రైడర్స్ జట్టు తరపున ఆడిన గౌతం గంభీర్  ఇక ఆ తర్వాత జట్టు నుంచి కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకున్నాడు. ఇప్పుడు లక్నో ఫ్రాంచైజీ  తో మళ్ళీ ఐపీఎల్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇదిలావుంటే ఇటీవల కాలంలో ఎంతో మంది సినీ సెలబ్రిటీలు క్రీడాకారులు కూడా వరుసగా వైరస్ బారిన పడుతూ ఉండడం ఆందోళనకరంగా మారిపోతుంది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: