ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ మేనియా మొదలు కాబోతుంది. ఫిబ్రవరి 12, 13 తేదీలలో బెంగళూరు వేదికగా మెగా వేలం జరగ బోతోంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మెగా వేలం గురించి అటు క్రికెట్ ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఐపీఎల్ లోకి లక్నో అహ్మదాబాద్ లాంటి రెండు జట్లు ఇవ్వడమే.. మెగా వేలం కి కారణం అయింది అన్న విషయం తెలిసిందే.. దీంతో ఎన్నో జట్లు కీలకమైన ఆటగాళ్లను వదులుకోవలసిన పరిస్థితులు వచ్చాయి.


 ప్రతి జట్టు కేవలం నలుగురు ఆటగాళ్లు మాత్రమే రిటైన్ చేసుకునేందుకు అవకాశం ఉంది అంటూ బీసీసీఐ తెలిపింది. దీంతో ఇక నలుగురు ఆటగాళ్లు మాత్రమే రిటైన్ చేసుకుని మిగితా ఆటగాళ్లను వదిలేసింది. అయితే కొంత మంది ఆటగాళ్లను వదిలేసేందుకు ఇష్టం లేకపోయినప్పటికీ రూల్స్ పాటించాలి కాబట్టి తప్పనిసరిగా చేయాల్సి వచ్చింది. అయితే ఇటీవలే కొన్ని జట్లు మెగా వేలంలోకి వదిలేసిన ఆటగాళ్లను మళ్ళీ సొంతం చేసుకునేందుకు సిద్ధమవుతున్నాయి అన్నది తెలుస్తుంది.


 ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న ఫాబ్ డూప్లేసెస్, షార్దుల్ ఠాగూర్, దీపక్ చాహర్,  బ్రావో లను మెగా వేలంలో కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది అన్నది తెలుస్తుంది. ఇలా మెగా వేలంలోకి వదిలేసినట్లు వదిలేసి మళ్ళీ అదే ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవడం వల్ల జట్టును మరింత పటిష్టంగా మార్చుకునేందుకు అవకాశం ఉంటుందని ప్లాన్ వేసాడట  ధోని. ఇక దీనికి అటు ఫ్రాంచైజీ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఏదేమైనా కొత్త ఆటగాళ్లు కాకుండా మళ్లీ పాత ఆటగాళ్లే జట్టులో కి వస్తారు అని తెలియడంతో అభిమానులు మురిసిపోతున్నారు.అదే సమయంలో ఇక సిఎస్కె మళ్లీ జట్టులోకి తీసుకోవాలని అనుకున్న ఆటగాళ్లకు మెగా వేలంలో తీవ్రమైన పోటీ ఉండే అవకాశం కూడా లేకపోలేదు

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl