క్రికెట్ ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టెస్ట్ మ్యాచ్ నేడే ప్రారంభం కాబోతోంది. గత ఏడాది కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన మ్యాచ్ ఇక నేటి నుంచి జరగబోతుంది. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఈ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం అవుతుంది అన్న విషయం తెలిసిందే. దీంతో ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారు. అయితే ఇక నేటి నుంచి ప్రారంభం కాబోయే 5 టెస్టులకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అఫీషియల్ బ్రాడ్కాస్టర్  స్కై స్పోర్ట్స్ సరికొత్త హంగులు అద్దనుంది  అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే టీఆర్ పీ ల కోసం మ్యాచ్ చూసేవాళ్ళకు సరికొత్త అనుభూతినిచ్చే విధంగా ఒక అదిరిపోయే ప్లాన్ సిద్ధం చేసింది. టీవీల ముందు కూర్చున్న ప్రేక్షకులందరికీ వినూత్నమైన రీతిలో ఎంటర్టైన్మెంట్ అందించేందుకు సిద్ధమైంది. ఇక ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డులు తీసుకున్న నిర్ణయం కారణంగా టీవీ ముందు కూర్చునే ప్రేక్షకులకు మరింత దగ్గర నుంచి మ్యాచ్ వీక్షించబోతున్నారు. అదెలా అనుకుంటున్నారా.. షాట్ లెగ్ లో  ఫీల్లింగ్ చేసే ఇంగ్లాండ్ ప్లేయర్ హెల్మెట్ మూడో నేత్రం ఉండనుంది. అదేంటి అనుకుంటున్నారా.. అదేనండీ కెమెరా అమర్చబోతున్నారు. ఇక దీని కోసం స్కై స్పోర్ట్స్ అంతర్జాతీయ క్రికెట్ మండలితో పాటు ఈసీబీ అనుమతి కూడా పొందింది అని తెలుస్తుంది.


 ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ తరఫున షార్ట్ లెగ్ వద్ద ఫీలింగ్ చేసేది యువ ఆటగాడు ఓలి పోప్ ఫీల్డింగ్ చేసే సమయంలో పెట్టుకునే హెల్మెట్ కు కెమెరా  అమర్చపోతున్నారు. తద్వారా టీవీ ముందు కూర్చుని మ్యాచ్ వీక్షించే అభిమానులు అందరూ కూడా బ్యాట్స్మెన్లను దగ్గరగా చూస్తూ.. కొత్త అనుభూతిని పొందవచ్చు. ఇందులో మరో విశేషం ఏంటంటే.. ఈ కెమెరా స్టేడియంలోని ప్రేక్షకులు సౌండ్ కాదు.. కేవలం తన ముందున్న బ్యాట్స్ మెన్ కదలికలు మాత్రమే  మాత్రమే రికార్డు చేస్తోంది. ఇక అంతకుముందు ఇంగ్లాండ్ లో నిర్ణయించిన ది హండ్రెడ్ లీక్ లో ఈ కెమెరా  టెక్నిక్ ను ఉపయోగించారు. అప్పుడు ఫీల్డర్లకు కాకుండా అంపైర్ల క్యాప్ కు కెమెరా అమర్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc